బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ Realme 6i మొదటి సేల్

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ Realme 6i మొదటి సేల్
HIGHLIGHTS

Realme 6i స్మార్ట్ ‌ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం జరగనుంది.

ఈ రియల్ ‌మీ 6i స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్, హై రిఫ్రెష్-రేట్ డిస్ప్లే మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా వంటి లేటెస్ట్ మరియు బెస్ట్ ఫీచర్లతో వస్తుంది.

ఈ Realme 6i ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.

ఇటీవల, కేవలం బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో రియల్‌ మీ ఇండియాలో విడుదల చేసినటువంటి  Realme 6i స్మార్ట్ ‌ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం జరగనుంది. ఈ రియల్ ‌మీ 6i స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్, హై రిఫ్రెష్-రేట్ డిస్ప్లే మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా వంటి లేటెస్ట్ మరియు బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Realme.com నుండి మొదలవుతుంది.  

Realme 6i Price

రియల్ ‌మీ 6i ధర విషయానికి వస్తే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌ రూ .12,999 ధరతో ప్రకటించబడగా, 6 జీబీ / 64 జీబీ మోడల్ ధర భారతదేశంలో రూ .14,999 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగులలో వస్తుంది – లూనార్ వైట్ మరియు ఎక్లిప్స్ బ్లాక్.

Realme 6i First sale

రియల్ మీ 6i జూలై 31 నుండి ఫ్లిప్ ‌కార్ట్ మరియు Realme India స్టోర్లలో అమ్మకానికి వస్తుంది.

Realme 6i Specifications (ప్రత్యేకతలు)

రియల్ మీ 6i సెల్ఫీ కెమెరా కోసం ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్‌ కలిగిన ఒక 6.5-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ క్వాలిటీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియో మరియు 90Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగి ఉంది. సాధారణ ప్రమాధాల నుండి అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 పొరతో ఈ స్క్రీన్ సురక్షితం చేయబడింది.

ఈ ఫోన్‌ ను మీడియా టెక్ హెలియో జి 90 టి చిప్‌సెట్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 76 జిపియు కలిగి ఉంది. ఇది 6GB RAM వరకు మరియు 64GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. అధనంగా, ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ఉపయోగించి 256GB వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపిక ఉంటుంది.

Realme 6i Camera

రియల్ ‌మీ 6i వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, ప్రాధమిక 48 MP కెమెరా, 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూతో సెకండరీ 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. వెనుక కెమెరాలు 4K UHD లో 30FPS వద్ద gyro-EIS సపోర్టుతో షూట్ చేయగలవు.

Realme 6i Battery

ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్ సపోర్ట్ తో 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo