రియల్మీ సంస్థ, ప్రీమియం కిల్లర్ స్మార్ట్ ఫోన్ను తీసుకురావడానికి కృషిచేస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ హ్యాండీల్లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా అందించిన ఒక ఫోటో త్వరలో తీసుకురానున్న ఆ స్మార్ట్ ఫోను యొక్క కెమెరాతో తీసినట్లు కూడా తెలిపింది. అయితే, ఇందులో ఒక విశేషం వుంది. అదేమిటంటే, ఈ ఫోటును తీసింది ఒక 64MP ప్రధాన కెమేరాతో కూడినటువంటి క్వాడ్ అంటే 4 కెమేరాల సెట్టప్పు గల కెమేరాతో తీసిన ఫోటో.
ఈ ఫోటో చూస్తే, నిజంగా మైమరచి పోవాల్సిందే. ఎందుకంటే, ఇందులో అన్ని విషయాలు కూడా సవివరంగా కనిపిస్తున్నాయి. మరియు అన్ని కలర్స్ కూడా చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఫోటో తీసిన తరువాత చాల వరకు దాన్ని లాగినా ( పించ్ ) చేసినా కూడా దీని పిక్సెళ్ళు విడిపోకుండా, డిటైల్డ్ గా ఫోటోను చూపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ట్విట్టర్ పేజీలో # Dare To Leap పేరుతొ అందిస్తున్న కార్యక్రం కూడా చాల వినూత్నంగా అనిపిస్తోంది. అందరికంటే ముందుగా ఆలోచించే లేదా ముందుకు నిలబడే ధైర్యం చేయటం అని అర్ధంవచ్చేలా వుండే ఈ నినాదం బహుశా అందరికంటే ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకురానున్న ఫీచర్ల గురించి తెలిపేలా ఉండనుంది కావచ్చు. ప్రస్తుతం, సాధారణ వినియోగదారుల నుండి మోధలుకోని ప్రీమియం వినియోగదారుల వరకు ఆ ఫోనులో అందించిన గొప్ప కెమేరాల గురించి ముఖ్యంగా కోరుకోరుకుంటున్నారు. కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ అందరి అంచనాలను దాటి ఉండవచ్చని భావిస్తున్నారు.
Image Source : రియల్మీ ట్విట్టర్ హ్యాండీల్