రియల్మీత్వరలో తీసుకురానున్న 64MP నాలుగు కెమేరాల ఫోన్ నుండి తీసిన ఫోటో అబ్బురపరుస్తోంది

HIGHLIGHTS

ఫోటో తీసిన తరువాత చాల వరకు దాన్ని లాగినా ( పించ్ ) చేసినా కూడా దీని పిక్సెళ్ళు విడిపోకుండా, డిటైల్డ్ గా ఫోటోను చూపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

రియల్మీత్వరలో తీసుకురానున్న 64MP నాలుగు కెమేరాల ఫోన్ నుండి తీసిన ఫోటో అబ్బురపరుస్తోంది

రియల్మీ సంస్థ, ప్రీమియం కిల్లర్ స్మార్ట్ ఫోన్ను తీసుకురావడానికి కృషిచేస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ హ్యాండీల్లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా అందించిన ఒక ఫోటో త్వరలో తీసుకురానున్న ఆ స్మార్ట్ ఫోను యొక్క కెమెరాతో తీసినట్లు కూడా తెలిపింది. అయితే, ఇందులో ఒక విశేషం వుంది. అదేమిటంటే, ఈ ఫోటును తీసింది  ఒక 64MP ప్రధాన కెమేరాతో కూడినటువంటి క్వాడ్ అంటే 4 కెమేరాల సెట్టప్పు గల కెమేరాతో తీసిన ఫోటో.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

64MP.jpg

ఈ ఫోటో చూస్తే, నిజంగా మైమరచి పోవాల్సిందే. ఎందుకంటే, ఇందులో అన్ని విషయాలు కూడా సవివరంగా కనిపిస్తున్నాయి. మరియు అన్ని కలర్స్ కూడా చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఫోటో తీసిన తరువాత చాల వరకు దాన్ని లాగినా ( పించ్ ) చేసినా కూడా దీని పిక్సెళ్ళు విడిపోకుండా, డిటైల్డ్ గా ఫోటోను చూపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

ట్విట్టర్ పేజీలో # Dare To Leap పేరుతొ అందిస్తున్న కార్యక్రం కూడా చాల వినూత్నంగా అనిపిస్తోంది. అందరికంటే ముందుగా ఆలోచించే లేదా ముందుకు నిలబడే ధైర్యం చేయటం అని అర్ధంవచ్చేలా వుండే ఈ నినాదం బహుశా అందరికంటే ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకురానున్న ఫీచర్ల గురించి తెలిపేలా ఉండనుంది కావచ్చు. ప్రస్తుతం, సాధారణ వినియోగదారుల నుండి మోధలుకోని ప్రీమియం వినియోగదారుల వరకు ఆ ఫోనులో అందించిన గొప్ప కెమేరాల గురించి ముఖ్యంగా కోరుకోరుకుంటున్నారు. కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ అందరి అంచనాలను దాటి ఉండవచ్చని భావిస్తున్నారు.       

Image Source : రియల్మీ ట్విట్టర్ హ్యాండీల్ 

                                          

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile