రియల్మీ 6 VS రెడ్మి నోట్ 8 ప్రో : పూర్తి సరిపోలిక

రియల్మీ 6 VS రెడ్మి నోట్ 8 ప్రో : పూర్తి సరిపోలిక
HIGHLIGHTS

ఏది మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

నిన్న రియల్మీ సంస్థ గేమింగ్ ప్రత్యేకమైన ప్రాసెసర్ అయినటువంటి Helio G90T మరియు 90Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే వంటి గొప్ప ఫీచర్లతో Realme 6 స్మృతి ఫోన్ను ఇండియాలో  విడుదల చేసింది. అయితే, ఇప్పటేకే అదే ప్రోసెసర్ తో అందుబాటులో ఉన్నటువంటి Redmi Note 8 Pro స్మార్ట్ ఫోన్ మంచి అమ్మకాలను సాధించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 64MP క్వాడ్ కెమేరా, స్పీడ్ ప్రాసెసర్ మరియు మంచి డిజనుతో లాంచ్ చెయ్యబాడ్డాయి. కాబట్టి, ఈరోజు మనం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఇప్పటికే వున్న షావోమి రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోనుతో, రియల్మీ 6 స్మార్ట్ ఫోన్ను సరిపోల్చి ఏది మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

Price

Realme 6 :  ధరలు

1. Realme 6  (4GB + 64GB) ధర – Rs.12,999

1. Realme 6  (6GB + 128GB) ధర – Rs.14,999

1. Realme 6  (8GB + 128GB) ధర – Rs.15,999

రెడ్మి నోట్ 8 ప్రో :  ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో  (6GB + 64GB) ధర – Rs.13,999

1. రెడ్మి నోట్ 8 ప్రో  (6GB + 128GB) ధర – Rs.15,999

1. రెడ్మి నోట్ 8 ప్రో  (8GB + 128GB) ధర – Rs.17,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో చాలా తేడా వుంది. ఎందుకంటే, రెడ్మి నోట్ 8 ప్రో 6.53 అంగుళాల డాట్ నోచ్ డిజైన్ గల FHD +  HDR డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటుంది. అయితే, రియల్మీ 6 మాత్రం 6.5 అంగుళాలు పరిమాణం కలిగిన FHD+ డిస్ప్లేని ఒక 90Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా ఒక ఇన్ డిస్ప్లే కెమేరా డిజైనుతో ఉంటుంది.       

ప్రాసెసర్ :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ముఖ్యమైన సారూప్యతగా , ఈ రెండింటి ప్రాసెసర్ల గురించి చెప్పొచ్చు. రియల్మీ 6 మరియు రెడ్మి నోట్ ప్రో రెండు కూడా ఒక 2.05 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల Mediatek Helio G90T ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తాయి. ఇక ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది 2.05 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందింస్తుంది మరియు ARM Mali G76 GPU తో వస్తుంది కాబట్టి గొప్ప గేమింగ్ మరియు గ్రాఫిక్స్ మీరు అందుకోవచ్చు.

వెనుక కెమేరా :

ఇక ఈ విభాగంలో కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకేవిధమైన కెమేరా ప్రత్యేకతలను కలిగి వున్నా సెన్సర్లలో కొంత మార్పు ఉంటుంది. రియల్మి 6 మరియు రెడ్మి నోట్ 8 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటుగా, F / 2.4 లెన్స్‌తో 2MP మ్యాక్రో లెన్స్  తో ఉంటుంది.  అయితే, రెడ్మి నోట్ ప్రో లో నాలుగవ కెమేరాగా  డేడికేటెడ్ డెప్త్ సెన్సార్ ఉంటే, రియల్మీ 6 లో మాత్రం బ్లాక్ & వైట్ పోర్ట్రైట్ సెన్సార్ తో వస్తుంది.  

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో, ఈ  రెండింటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. రియల్మీ 6 ముందుభాగంలో ఒక 16MP  సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అయితే, రెడ్మి నోట్ 8 మాత్రం ఒక 20MP డాట్ నోచ్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అంటే, రియల్మీ ఒక ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్) సెల్ఫీ కెమేరా డిజనుతో వస్తుండగా, రెడ్మి నోట్ 8 ప్రో డాట్ నోచ్ సెల్ఫీ డిజైనుతో వస్తుంది.    

 బ్యాటరీ :

 రెడ్మి నోట్ 8 ప్రో ఒక 4500mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క మద్దతు ఇస్తుంది. ఇక రియల్మీ6 విషయానికి వస్తే, ఇది ఒక 4300mAh బ్యాటరీతో టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు ఇది 30W వాట్స్  ఫ్లాష్ ఛార్జ్  మద్దతు ఇస్తుంది.

OS & సెక్యూరిటీ:

ఈ విభాగంలో, రియల్మీ 6 స్మార్ట్ ఫోన్ తమ సొంత Realme UI స్కిన్ పైన ఆండ్రాయిడ్ 10 ఫై ఆధారితంగా పనిచేస్థాయి. ఇక రెడ్మి విషయానికి వస్తే, ఇది MIUI 10 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై తో నడుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo