రూ.12,999 ధరలో 64MP కెమేరా మరియు భారీ స్పెక్స్ గల Realme 6 సేల్ ఇప్పటికి అందుబాటులో..

రూ.12,999 ధరలో 64MP కెమేరా మరియు భారీ స్పెక్స్ గల Realme 6 సేల్ ఇప్పటికి అందుబాటులో..
HIGHLIGHTS

ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు 60 నిమిషాల్లో ఫోన్ను 100% ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

ఇటీవల, రియల్మీ సంస్థ ఇండియాలో కేవలం రూ.12,999 ధరలో 64MP క్వాడ్ కెమేరా మరియు భారీ స్పెక్స్ గల Realme 6 యొక్క సేల్ ని ప్రకటించింది మరియు ఈ సేల్ ఇప్పుడు కూడా అందుబాటులోనే వుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనులుగోలు చెయ్యడానికి ఈ ఫోన్ యొక్క సేల్ ని flipkart లో ఇంకా 'Sale Is On'  గానే ప్రకటించింది. అంటే, ఫ్లాష్ సేల్ లాగా టైం తో పనిలేకుండా కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ గేమింగ్ ప్రాసెసర్ మరియు 90Hz రిఫ్రెష్ రేటుగల స్మూత్ డిస్ప్లే వంటి ఫీచర్లతో విడుదల చెయ్యబడింది.

Realme 6: ప్రత్యేకతలు 

రియల్మి 6 లో ఒక 6.5 "FHD + డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ తో రక్షిణతో ఇచ్చింది. ఈ రియల్మి 6 యొక్క డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకురాబడింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్లలో కొత్తగా చేర్చబడింది. ఈ ఫోన్ను గేమింగ్ కోసం మీడియాటెక్ తీసుకొచ్చిన, మీడియాటెక్ హిలియో జి 90T  ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది. రియల్మి 6 (4 జీబీ + 64 జీబీ, 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ) వంటి వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. . ఈ ఫోనులో ఒక 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు 60 నిమిషాల్లో ఫోన్ను 100% ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

కెమేరాల విషయానికి వస్తే, Realme 6 యొక్క వెనుక భాగంలో క్వాడ్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఇందులో, ఒక ప్రధాన 64MP కెమేరాకి జతగా 8MP వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ లతో ఉంటుంది. ఇక ముందుభాగంలో 16MP పంచ్ హోల్ సెల్ఫీ కెమేరాని అందించింది. రియల్మి 6, 4 జీబీ + 64 జీబీ ధర రూ .12,999 కాగా, 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీలను వరుసగా రూ .14,999, రూ .15,999 గా ప్రకటించారు. వాస్తవానికి, నిన్న 12 గంటలకి దీని మొదటి ఫ్లాష్ సేల్ ప్రకటించగా, ఈ సేల్ ఇప్పటికి live గానే ఉంచింది.                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo