Realme 16 Pro Series: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా అనౌన్స్ చేసింది
ఇప్పటి వరకు అందించని కొత్త డిజైన్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క నాలుగు కీలక ఫీచర్లు కూడా రియల్ మీ బయటకు వెల్లడించింది
Realme 16 Pro Series: రియల్ మీ అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా అనౌన్స్ చేసింది. రియల్ మీ ఇప్పటి వరకు అందించని కొత్త డిజైన్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ ఫోన్స్ గొప్ప కెమెరా మరియు వేగవంతమైన చిప్ సెట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వస్తున్నాయని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.
SurveyRealme 16 Pro Series: లాంచ్ డేట్?
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి మేము ముందే ఊహించిన విధంగా 2026 ప్రారంభం లో లాంచ్ అవుతుంది. ఖచ్చితమైన డేట్ చెప్పాలంటే, రియల్ మీ 16 ప్రో సిరీస్ ను 2026 జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ఈరోజు అనౌన్స్ చేసింది.
ఈ సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు అందించే అవకాశం ఉంది. ఇందులో రియల్ మీ 16 ప్రో మరియు 16 ప్రో ప్లస్ రెండు ఫోన్లు ఉంటాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క నాలుగు కీలక ఫీచర్లు కూడా రియల్ మీ బయటకు వెల్లడించింది.
Realme 16 Pro Series: ఫీచర్స్
రియల్ మీ 16 ప్రో సిరీస్ ఫోన్లు 200MP పోర్ట్రైట్ మాస్టర్ కెమెరా సెటప్ తో లంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో Luma Color అల్గారిథం ఉపయోగించినట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ సిరీస్ కోసం ప్రత్యేకమైన 3D ఫాంటమ్ మాట్రిక్స్ మరియు 16-బిట్ RAW డొమైన్ కంప్యూట్ వంటి నైట్ మోడ్ కలర్ వివరాలు కలిగిన ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ మరింత గొప్ప Vivid కలర్ మరియు గొప్ప బ్రైట్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని కూడా రిల్ మీ చెబుతోంది. ఇది Ai ఎడిట్ జీనీ 2.0 ఫీచర్ తో కూడా లాంచ్ అవుతుంది.

ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ జ్యువెలరీ వంటి లగ్జరీ ఫినిష్ కలిగిన మిర్రర్ ఫినిష్ కెమెరా మోడ్యూల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక నేచురల్ టచ్ ఫీల్ అందించే యూనిక్ డిజైన్ తో ఉంటుంది. ఇది అల్ట్రా స్లిమ్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపించే కొత్త డిజైన్ లో ఉంటుంది. ఈ ఫోన్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, కమేలియా పింక్ మరియు ఆర్కిడ్ పర్పల్ అనే నాలుగు రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: Chat GPT : అద్భుతమైన ఇమేజ్ క్రియేట్ చేసే కొత్త Image Generation ఫీచర్ అందించింది.!
రియల్ మీ ఈ అప్ కమింగ్ సిరీస్ ను Realme UI 7.0 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ మరియు క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ ఉంటాయని రియల్ మీ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ సిరీస్ మరిన్ని అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.