Realme 15 5G ఫోన్ పై రూ. 5000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Realme 15 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ రూ. 5000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో ఇప్పుడు సేల్ కి వచ్చింది

రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ ఆఫర్ ప్రైస్ లో కచ్చితంగా ఆకట్టుకునే ఫీచర్లు కలిగి ఉంటుంది

Realme 15 5G ఫోన్ పై రూ. 5000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందుకోండి.!

గత వారం ఇండియాలో విడుదలైన Realme 15 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. డ్యూయల్ 4K కెమెరా మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో 25 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో విడుదలైన ఈ ఫోన్ రూ. 5000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 15 5G : ప్రైస్ అండ్ ఆఫర్లు

రియల్ మీ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) ని రూ. 25,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై అందించిన రూ. 5,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 20,999 ధరలు లభిస్తుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రియల్ మీ అందించిన ఈ ఆఫర్ ను అందుకునే అవకాశం మీ ముందుంది.

Realme 15 5G Sale Offer

కేవలం ఈ ఒక్క వేరియంట్ పై మాత్రమే కాదు ఈ ఫోన్ 8 జీబీ+ 256 జీబీ మరియు 12 జీబీ + 256 జీబీ వేరియంట్ పై కూడా ఈ ఆఫర్లు అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో 256 జీబీ వేరియంట్ ను రూ. 22,999 ధరలో మరియు 12 జీబీ వేరియంట్ ను రూ. 25,999 రూపాయల ధరలో అందుకోవచ్చు. అలాగే, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది.

Also Read: Oppo K13 Turbo Series ను మొబైల్ రంగం ఎన్నడూ చూడని ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ చేస్తోంది.!

Realme 15 5G : ఫీచర్లు

రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ ఆఫర్ ప్రైస్ లో కచ్చితంగా ఆకట్టుకునే ఫీచర్లు కలిగి ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఫోన్ గొప్ప క్వాడ్ కర్వ్ డిస్ప్లే మొదలుకొని సూపర్ కెమెరాల వరకు అన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7300+ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో జతగా 256 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఆకట్టుకుంటుంది.

ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 ఇంచ్ 4D ప్లస్ కర్వుడ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ కలిగి ఉండటమే కాకుండా 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ గేమింగ్ మరియు కంటెంట్ కోసం చక్కగా సరిపోతుంది. ఇక కెమెరా పరంగా ఈ ఫోన్ 50MP Sony IMX882 సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులోని రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి మరియు AI ఎడిట్ జీనీ ఫీచర్ కూడా కలిగి ఉంటాయి.

ఈ రియల్ మీ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo