Realme 13 Pro+ 5G: ఈ టాప్ 5 ఫీచర్స్ తో రేపు విడుదల అవుతోంది.!

HIGHLIGHTS

Realme 13 Pro+ 5G ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది

ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తోంది

ఫోన్ ను ఈ టాప్ 5 ఫీచర్స్ తో తీసుకు వస్తుందని క్లియర్ అయ్యింది

Realme 13 Pro+ 5G: ఈ టాప్ 5 ఫీచర్స్ తో రేపు విడుదల అవుతోంది.!

Realme 13 Pro+ 5G: రియల్ మీ 13 ప్రో సిరీస్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తోంది. అయితే, వీటిలో రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ ను కంపెనీ ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫోన్ ను ఈ టాప్ 5 ఫీచర్స్ తో తీసుకు వస్తుందని క్లియర్ అయ్యింది. రేపు ఇండియాలో విడుదల కాబోతున్న రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 13 Pro+ 5G టాప్ 5 ఫీచర్స్

రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తుంది. ఈ టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ ను అందించింది.

Realme 13 Pro+ 5G

కెమెరా

ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో రెండు Sony పవర్ ఫుల్ సెన్సార్ లు ఫీచర్స్ తో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో, 50MP Sony LYT – 701 + 50MP Sony LYT – 600 రెండు పవర్ ఫుల్ కెమెరా లకు జతగా మరో కెమెరా కలిగి ఉంటుంది. ఈ రెండు కెమెరాలు కూడా OIS సపోర్ట్ ను కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ రెండు సోనీ కెమెరాలు కూడా OIS సపోర్ట్ ను కలిగి ఉంటాయి.

AI కెమెరా మరియు హైపర్ ఇమేజ్ ప్లస్

రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లో AI కెమెరా మరియు హైపర్ ఇమేజ్ ప్లస్ సపోర్ట్ వుంది. ఈ రెండు ఫీచర్స్ తో ఈ ఫోన్ తో అద్భుతమైన క్లారిటీ కలిగిన ఫోటోలు మరియు వీడియోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ కెమెరా 120x జూమ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్ హెన్స్మెంట్ మరియు AI ఆడియో జూమ్ వంటి చాలా AI ఫీచర్స్ కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది.

డిస్ప్లే మరియు డ్యూరబిలిటీ

ఈ ఫోన్ గొప్ప డ్యూరబిలిటీ మరియు డిస్ప్లే పైన శక్తివంతమైన గ్లాస్ ను కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఈ స్విస్ SGS 5 – స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుందని కూడా తెలిపింది.

Also Read: Airtel Plans: రేట్లు పెరిగిన తర్వాత కూడా Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!

బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్

రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను 5200 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది.

ప్రోసెసర్ మరియు కూలింగ్ సిస్టం

ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ Snapdragon 7 Series చి చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ ను అత్యంత వేగంగా చల్లబరిచే 3D VC కూలింగ్ ఫీచర్ తో లాంచ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo