Realme Narzo 90 Series 5G నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
Realme Narzo 90 Series 5G ఇండియాలో లాంచ్ అవుతోంది
ఈ సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తునట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది
సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతాయని కంపెనీ టీజింగ్ చేస్తోంది
Realme Narzo 90 Series 5G నుంచి ఇండియాలో రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తునట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. గత సిరీస్ కంటే ఈ ఫోన్లు మరింత వేగంగా ఉంటాయి మరియు సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతాయని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి కంపెనీ చెబుతున్న కొత్త ముచ్చట్లు ఏమిటో చూసేద్దామా.
SurveyRealme Narzo 90 Series 5G : లాంచ్ డేట్
రియల్ మీ నార్జో 90 సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ తెలిసేలా ఈ ఫోన్ టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ సిరీస్ కోసం అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి వినూత్నంగా టీజింగ్ చేస్తోంది.
Realme Narzo 90 Series 5G : ఫీచర్స్ ఏమిటి?
అమెజాన్ ఇండియా టీజర్ పేజీ నుంచి రియల్ మీ అందించిన టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ సిరీస్ నించి రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే, సిరీస్ వేరియంట్ పేర్లు ఇంకా వెల్లడించలేదు. ఇందులో రెగ్యులర్ మరియు ప్రో రెండు వేరియంట్స్ ఉంటాయని ఊహిస్తున్నారు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

రియల్ మీ నార్జో 90 సిరీస్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జ్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తాయని రియల్ మీ టీజింగ్ చేస్తోంది. వేగంగా ఇమేజ్ క్యాప్చర్ చేసే కెమెరా సెటప్ మరియు మంచి రిజల్యూషన్ వీడియోలు అందించే సెన్సార్లు ఈ ఫోన్స్ లో ఉంటాయని చెబుతోంది. ఈ ఫోన్ ఎండలో కూడా మంచి విజువల్స్ అందించే మంచి బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుందని కూడా రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ రేపు వెల్లడిస్తుంది.
Also Read: 200MP కెమెరా ఫోన్ vivo V60e పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
ఇప్పటికే రియల్ మీ నార్జో సిరీస్ నుంచి మంచి ఫోన్లు అందించిన కంపెనీ, ఇప్పుడు మరో రెండు నెక్స్ట్ జనరేషన్ ఫోన్లు లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ తో మళ్ళి కలుద్దాం.