విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్ పంపిణీ……ఆ రాష్ట్రంలో విద్యార్థులకు పండగే

విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్ పంపిణీ……ఆ రాష్ట్రంలో విద్యార్థులకు పండగే
HIGHLIGHTS

అంతర్జాతీయ యువజన దినోత్సవం అయిన ఆగస్టు 12 నుంచి విద్యార్థులకు స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఉచితంగా పంపిణీ చేస్తామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లోని 12 వ తరగతి విద్యార్థులకు ఈ స్మార్ట్ ‌ఫోన్ లభిస్తుందని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది.

మొదటి దశలో, మొత్తం 1.75 లక్షల యూనిట్ల స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేయనున్నారు మరియు ప్రభుత్వం 50,000 స్మార్ట్ ‌ఫోన్స్ మొదటి విడతగా పంచనుంది.

అంతర్జాతీయ యువజన దినోత్సవం అయిన ఆగస్టు 12 నుంచి విద్యార్థులకు స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఉచితంగా పంపిణీ చేస్తామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 12 వ తరగతి విద్యార్థులకు ఈ స్మార్ట్ ‌ఫోన్ లభిస్తుందని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. మొదటి దశలో, మొత్తం 1.75 లక్షల యూనిట్ల స్మార్ట్‌ ఫోన్లను  పంపిణీ చేయనున్నారు మరియు ప్రభుత్వం 50,000 స్మార్ట్ ‌ఫోన్స్ మొదటి విడతగా పంచనుంది. అయితే, ఈ స్మార్ట్ ‌ఫోన్లు ఏ కంపెనీకి చెందినవి మరియు ఏ మోడళ్లు అనే విషయాలు ఇంకా బయటకి రాలేదు.

విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ ఫోన్‌ లను పంపిణీ చేయనున్న పంజాబ్ ప్రభుత్వం

గుంపులు గుంపులుగా ఎక్కువ మంది విద్యార్థులు ఒక్కచోట గుమ్మికూడకుండా ఉండటానికి మరియు చెలరేగుతున్న ఈ మహమ్మారి సమయంలో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, “ఆ పట్టణం / జిల్లాలో చదువుతున్న 15 మందికి పైగా విద్యార్థులకు విడివిడిగా స్మార్ట్ ‌ఫోన్ ‌లను అందజేయడానికి ప్రతిఒక్కరిని విడివిడి ప్రదేశంలో ఆహ్వానించబడరు” అని ప్రకటించింది. ఈ స్మార్ట్ ‌ఫోన్స్ పంపిణీ చండీఘడ్, పంజాబ్‌ లోని 26 ప్రదేశాలలో జరుగుతుంది. ఈ 26 ప్రదేశాలు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు కొన్ని ప్రధాన పట్టణాలను కూడా కవర్ చేస్తాయి.

 

 

విద్యార్థులు, పాఠశాలకు వెళ్లే వీలులేని ఈ సమయంలో, ఇంటి నుండే క్లాసులు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో, విద్యార్థులు ఆన్ ‌లైన్ తరగతులను చూడగలిగేలా కనీసం స్మార్ట్ ‌ఫోన్ కలిగి ఉండాలి. అయితే, ఎక్కువ శాతం జనాభా వద్ద స్మార్ట్‌ ఫోన్‌ లేని కారణంగా కాబట్టి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే ప్రక్రియ చాలా కష్టతరంగా మారింది. సామాజిక దూరం ఉన్న ఈ సమయాల్లో, ఆన్ ‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఒక స్మార్ట్ ‌ఫోన్ ఇతర విద్యార్థి మరొక విద్యార్థి ఇంటికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo