Poco X8 Pro Max: జబర్దస్త్ ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

పోకో ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది

పోకో X8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో రిలీజ్ చేసింది

ఈ ఫోన్ లో 9000 mAh అల్ట్రా బిగ్ బ్యాటరీ ని పోకో అందించింది

Poco X8 Pro Max: పోకో ఈరోజు నిర్వహించిన ఆన్‌లైన్ ఈవెంట్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో పోకో X8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్లో ఎన్నడూ లేని విధంగా 9000 mAh భారీ బ్యాటరీ మరియు 3 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.

Poco X8 Pro Max: ప్రైస్

పోకో ఈ లేటెస్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇక్కడ లిస్ట్ చేశాము.

  • పోకో X8 ప్రో మాక్స్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 42,999
  • పోకో X8 ప్రో మాక్స్ (12GB + 512GB) ప్రైస్ : రూ. 46,999

ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ తో మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్స్:

పోకో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 3,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఇవి కాకుండా ఈ ఫోన్ పై Spotify ప్రీమియం మరియు రూ. 7,000 రూపాయల విలువైన Youtube ప్రీమియం బెనిఫిట్ వంటి ఆఫర్స్ కూడా అందించింది.

Also Read: Apple AirPods Max 2: మరింత శక్తివంతమైన ANC మరియు బిగ్ బ్యాటరీతో వచ్చింది.!

Poco X8 Pro Max: ఫీచర్స్

పోకో ఈ స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ 60/90/120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2000 నిట్స్ HBM బ్రైట్నెస్ మరియు HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు లేటెస్ట్ అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 20 కంటే ఎక్కువ గేమ్స్ ని 120FPS లో ప్లే చేసే సత్తా కలిగి ఉంటుంది.

ఈ పోకో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500s చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది మీడియా టెక్ యొక్క లేటెస్ట్ చిప్సెట్ మరియు ఇది 3 Mn కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ మరియు 512GB హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టం తో Hyper OS 3.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4OS అప్గ్రేడ్ అండ్ 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

ఈ ఫోన్ కెమెరా పరంగా సింపుల్ అండ్ పవర్ ఫుల్ సెటప్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ లో కేవలం 50MP (UW) మెయిన్ కెమెరా జతగా 8MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, ఇది 60 FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 9000 mAh అల్ట్రా బిగ్ బ్యాటరీ ని పోకో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :