Poco X3 Pro: స్నాప్ డ్రాగన్ 860 తో లాంచ్

Poco X3 Pro: స్నాప్ డ్రాగన్ 860 తో లాంచ్
HIGHLIGHTS

Poco X3 Pro విడుదలయ్యింది.

120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

గొరిల్లా గ్లాస్ 6 తో వస్తుంది

Poco X3 Pro విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం వచ్చిన పోకో X3 యొక్క ప్రో వెర్షన్ గా వచ్చింది. పోకో X3 ప్రో స్నాప్ డ్రాగన్ 860 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ముందుగా ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ ని నిజం చేస్తూ గొరిల్లా గ్లాస్ 6 తో కూడా వుంటుంది. పోకో X3 ప్రో స్మార్ట్ ఫోన్ తో పాటుగా పోకో F3 స్మార్ట్ ఫోన్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870  ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB వరకూ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది.

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో నోచ్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo