కొత్త ఫోన్ Pro ఫోన్ లాంచ్ చెయ్యనున్న POCO: మరి ఏంటా PRO?

HIGHLIGHTS

POCO కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్

#PRO వెర్షన్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

కొత్త ఫోన్ Pro ఫోన్ లాంచ్ చెయ్యనున్న POCO: మరి ఏంటా PRO?

పోకో, మార్చి 30న తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ గురించి ఎటువంటి వివరాలను అందించలేదు. కానీ, ఈ ఫోన్ ను #PRO వెర్షన్ గా విడుదల చేస్తున్నట్లు మాత్రం ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే, ఇటీవల ఇండియాలో విడుదలైన పోకో X3 యొక్క ప్రో వెర్షన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. పోకో X3 గత సెప్టెంబర్ లో 64MP క్వాడ్ కెమెరా 120Hz రిఫ్రెష్ డిస్ప్లే మరియు మరిన్ని ప్రత్యేకతలతో చాలా తక్కువ ధరలో వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక మార్చి 30 న పోకో లాంచ్ చేయనున్న PRO గురించి పోకో కొన్ని విషయాలను తెలిపింది. ఇందులో, ప్రైస్-పెర్ఫార్మెన్స్ ని బ్రేక్ చేసే టైం వచ్చిందని చెబుతోంది.  ధరతో సంబంధం లేని పెర్ఫార్మెన్స్ అందించ గల స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే, పోకో లాంచ్ చెయ్యనున్న PRO ఫోన్ ను భారీ ఫీచర్లతో చాలా తక్కువ ధరకే ప్రకటించవచ్చని అర్ధమవుతోంది.

ఈ పోకో X3 లో ఉండనున్నట్లు అంచనా వేస్తున్న స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద FHD+ డిస్ప్లేని 120Hz ఉందవచ్చు. ప్రాసెసర్ కూడా చాలా వేగవంతమైనదిగా ఇవ్వవచ్చు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 860 ఆక్టా కోర్ ప్రాసెసర్ ని ఇవ్వొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ సెటప్ కూడా ఉంటుందని అంచనా.         

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile