2020 లో POCO ఫోన్ F 2 వచ్చే అవకాశం : కొత్త పేటెంట్ లీక్ వివరిస్తున్న కొత్త విషయాలు

2020 లో POCO ఫోన్ F 2 వచ్చే అవకాశం : కొత్త పేటెంట్ లీక్ వివరిస్తున్న కొత్త విషయాలు
HIGHLIGHTS

ఈ క్రింద పేటెంట్‌ ను మీరు పరిశీలించవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా విడుదలైన ఫోన్లలో, Poco Phone F1 కూడా ఒకటి మరియు  వినియోగదారులు కొంతకాలంగా ఈ ఫోన్ యొక్క రెండవ వెర్షన్ను కూడా  ఆశిస్తున్నారు. వాస్తవానికి, ఈఫోనే గురించిన రూమర్లు చాలా అరుదుగా వస్తుంటాయి మరియు ఇప్పటి వరకూ, 2020 లో ఈ ఫోన్ విడుదల అవుతుందని, షావోమి గ్లోబల్ హెడ్, ఆల్విన్ టిఎస్ టీజ్ చేస్తున్నారు. దీని గురించి మనకు లభించిన సమాచారం ఇది మాత్రమే ఉంది.

కానీ ఇప్పుడు, PCOC F 2 అనే పరికరం కోసం షావోమి ఇప్పటికే ట్రేడ్‌ మార్క్‌ ను దాఖలు చేసిందని @_the_tech_guy నుండి కొత్తగా బయటపడిన పత్రాలు చెబుతున్నాయి. కంపెనీ ఈ పేటెంట్ దాఖలు చేసిందని మరియు దాని నుండి ఎటువంటి సమాచారం రాదని దీని అర్థం. దాఖలు చేయబడిన వివిధ పరికరాల కోసం చాలా పేటెంట్లు ఉన్నాయి మరియు దాని నుండి ఇంతవరకూ ఏమీ రాలేదు. కాబట్టి ఈ వార్తను పూర్తిగా నమ్మకమైనదిగా చెప్పకపోవచ్చు. ఈ క్రింద పేటెంట్‌ ను మీరు పరిశీలించవచ్చు.

పరికరం బయటకు రావడం ముగిస్తే, దాన్ని బహుశా పోకోఫోన్ ఎఫ్ 2 అని పిలుస్తారు. అయినప్పటికీ, ఈ ఫోన్ను భారతదేశంలో PCOC F 2 అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఇక్కడ ప్రారంభించినప్పుడు మొదటి ఫోన్ను పోకో ఎఫ్ 1 గా పిలిచారు కాబట్టి, తరువాత ఫోన్ను ఇలా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి, దాని అర్ధం  ఏమిటంటే, లీకైన పత్రాల ప్రకారం, ఈ ఫోన్ 2020 లో మార్కెట్ల బాటపట్టాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo