Poco M7 5G : బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

పోకో కొత్త ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

Poco M7 5G ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ కొత్త 5జి ఫోన్ సరికొత్త డిజైన్ మరియు చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది

Poco M7 5G : బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Poco M7 5G: పోకో కొత్త ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. పోకో ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈరోజే సరికొత్తగా పోకో విడుదల చేసిన పోకో ఎం7 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M7 5G : ప్రైస్

పోకో ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కోసం ఫిక్స్ చేసింది. అలాగే, ఈ ఫోన్ వైపొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 11,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై ఫస్ట్ డే సేల్ బిగ్ ఆఫర్ ను ప్రకటించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను మొదటి రోజు రూ. 500 తగ్గింపుతో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ మరియు స్టెయిన్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.

Also Read: అండర్ రూ. 3,000 బడ్జెట్ లో బెస్ట్ Bluetooth Speaker డీల్స్.!

Poco M7 5G: ఫీచర్స్

పోకో ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ ప్రోసెసర్ మరియు 450K కి పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 12GB వరకు ర్యామ్ ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 6.88 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

Poco M7 5G Features

ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony) డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 1080p వీడియో సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 5160 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ బాక్స్ లో 33W ఫాస్ట్ ఛార్జర్ ను కూడా పోకో అందిస్తుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo