POCO M4 Pro 5G: 50MP కెమెరా మరియు DCI-P3 సపోర్ట్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది
POCO M4 Pro 5G విడుదల చెయ్యబడింది
ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది
ఈ కొత్త ఫోన్ ను పోకో ఎం3 ప్రో అప్గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది
పోకో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ POCO M4 Pro 5G ను ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ ను పోకో ఎం3 ప్రో అప్గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ POCO M4 సిరీస్ లో మొదటి ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ మరియు మరిన్ని బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యబడింది.
POCO M4 Pro 5G: ధర
POCO M4 Pro 5G రెండు వేరియంట్ లలో వస్తుంది. వీటిలో బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 229 (సుమారు రూ. 19,600) ధరతో వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 249 (సుమారు రూ. 21,400) ధరతో వచ్చింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు పోకో ఎల్లో అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
POCO M4 Pro 5G: స్పెక్స్
ఈ POCO M4 Pro 5G ఫోన్ పెద్ద 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోన్లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.
పోకో ఎం4 ప్రో 5G వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. అయితే, ఇది ఎక్కువ కెమెరాలతో ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.