POCO M3 Pro 5G: చవకైన పోకో 5G ఫోన్ వచ్చేస్తోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 Jun 2021
HIGHLIGHTS
  • POCO M3 Pro 5G ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది

POCO M3 Pro 5G: చవకైన పోకో 5G ఫోన్ వచ్చేస్తోంది
POCO M3 Pro 5G: చవకైన పోకో 5G ఫోన్ వచ్చేస్తోంది

POCO M3 Pro 5G ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే, ఇప్పుడు ఈ లేటెస్ట్ పోకో 5G ఫోన్ ఇండియాలో విడుదల అవుతోంది. ఈ POCO M3 Pro 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 8 న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు పోకో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ Poco 5G స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ 5G చిప్ సెట్ మరియు మరిన్ని ప్రత్యేకతలతో ఆకర్షణీయమైన ధరతో ఇండియాలో లాంచ్ అవుతోంది.

POCO M3 Pro 5G: గ్లోబల్ వేరియంట్ ధరలు

ఈ ఫోన్ యొక్క ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో 4GB + 64GB బేసిక్ వేరియంట్ ని 159 యూరోలు(సుమారు 14,000 ధర) వద్ద ప్రకటించింది. ఇందులోనే, హై ఎండ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ ని 179 యూరోలు(సుమారు 16,000 ధర) వద్ద ప్రకటించింది. పోకో ఎం3 ప్రో 5G కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో అనే మూడు ఆకర్షిణీయమైన రంగుల్లో లభిస్తుంది.

POCO M3 Pro 5G: స్పెషిఫికేషషన్స్ (గ్లోబల్) 

ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం 3 ప్రో 5 జి యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. అధనముగా, ఈ డిస్ప్లే డైనమిక్ స్విచ్ ఫీచర్ మరియు 1,500: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది.

ఇక ఫోన్ ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది, ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరా నైట్ మోడ్, AI కెమెరా 5.0, మూవీ ఫ్రేమ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియో మరియుమ్యాక్రో మోడ్‌తో సహా అనేక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే f / 2.0 ఎపర్చర్‌ తో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, పోకో ఎం 3 ప్రో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌ లాక్‌ తో వస్తుంది. ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: poco m3 pro 5g launch date fix in india
Tags:
POCO M3 Pro 5G POCO M3 Pro 5G india launch POCO M3 Pro 5G india price POCO M3 Pro 5G specs తెలుగు న్యూస్ తెలుగు వార్తలు లేటెస్ట్ తెలుగు న్యూస్ తాజా తెలుగు వార్తలు
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Apple iPhone 12 (64GB) - White
Apple iPhone 12 (64GB) - White
₹ 60900 | $hotDeals->merchant_name
Apple iPhone 13 (128GB) - Starlight
Apple iPhone 13 (128GB) - Starlight
₹ 65999 | $hotDeals->merchant_name
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
₹ 9999 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 61999 | $hotDeals->merchant_name
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
₹ 14499 | $hotDeals->merchant_name