Poco M2 Pro సరసమైన ధరలో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది

Poco M2 Pro సరసమైన ధరలో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది
HIGHLIGHTS

Poco M2 Pro స్మార్ట్ ఫోన్‌ను చాలా సరసమైన విభాగానికి తీసుకువచ్చింది.

ఈ Poco M2 Pro విషయానికి వస్తే, ఇది రెడ్‌మి నోట్ 9 ప్రో వంటి హార్డ్‌వేర్‌ను అందిస్తుంది.

ఇప్పటికే, ముందుగా వచ్చిన Poco X2 తో భారీ ఫీచర్లను మిడ్ రేంజ్ ధరకు తగ్గించగా, ఇప్పుడు ఇండియాలో కొత్తగా ప్రకటించిన Poco M2 Pro స్మార్ట్ ఫోన్‌ను చాలా సరసమైన విభాగానికి తీసుకువచ్చింది. ఇక ఈ Poco M2 Pro విషయానికి వస్తే, ఇది రెడ్‌మి నోట్ 9 ప్రో వంటి హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. ఇది మార్చి నెలలో  భారతదేశంలో ప్రారంభించబడింది. Poco బ్రాండ్‌ నుండి కొత్త M లైనప్‌ను మొదలుపెట్టింది మరియు దీనిని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G  ప్రాసెసర్‌తో వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలతో పనిచేస్తుంది.

Poco M2 Pro ధర మరియు లభ్యత

పోకో ఎం 2 ప్రో ధరల గురించి క్లుప్తంగా చూస్తే: 4 GB ర్యామ్ + 64 GB  స్టోరేజ్ వేరియంట్ రూ .13,999 ధరతో, 6 GB ర్యామ్ + 64 GB జిబి స్టోరేజ్ వేరియంట్‌ రూ .14,999 ధరతో మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్‌ రూ .16,999 ధరతో ప్రకటించబడింది . M2 Pro యొక్క సేల్, జూలై 14 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలు అవుతుంది.

Poco M2 Pro ఫీచర్స్ 

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ ‌తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్‌ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్‌తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo