ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి POCO M2 Pro అతి తక్కువ ధరకే లభిస్తోంది

HIGHLIGHTS

POCO M2 Pro అతి తక్కువ ధరకే లభిస్తోంది

Flipkart సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు

HDFC బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్.

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి POCO M2 Pro అతి తక్కువ ధరకే లభిస్తోంది

ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ నుండి POCO M2 Pro అతి తక్కువ ధరకే లభిస్తోంది.  ఈ Flipkart సేల్ నుండి స్మార్ట్  ఫోన్ల పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. POCO M2 PRO స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుంచి డిస్కౌంట్ ధరతో అమ్ముడవుతోంది. లాంచ్ సమయంలో , రూ.13,999 రుపాయల ధరతో ప్రకటించబడిన ఈ స్మార్ట్ ఫోన్, ఈ Flipkart సేల్ నుంచి తక్కువ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ పోకో ఎం2 ప్రో ఈ సేల్ నుండి 2000 రూపాయల డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.11,999 రుపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అధనంగా, HDFC  బ్యాంక్ క్రెడిట్  కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది.

Poco M2 Pro: ప్రత్యేకతలు

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile