Prime Day
Prime Day

POCO X2 రికార్డ్ : Flipkart లో అత్యున్నతమైన రేటింగ్ ఫోనుగా నిలిచింది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 13 Mar 2020
HIGHLIGHTS
  • Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అరుదైన ఘనతను కూడా సాధించింది.

POCO X2 రికార్డ్ : Flipkart లో అత్యున్నతమైన రేటింగ్ ఫోనుగా నిలిచింది
POCO X2 రికార్డ్ : Flipkart లో అత్యున్నతమైన రేటింగ్ ఫోనుగా నిలిచింది

ఇండియాలో కేవలం మిడ్ రేంజ్ ధరలో 64MP SonyIMX686 సెన్సార్ మరియు స్నాప్ డ్రాగన్ 730G SoC వంటి గొప్ప ఫిచర్లతో విడుదలైన POCO X2, ఇప్పటి వరకూ జరిగిన ఫ్లాష్ సేల్ నుండి గొప్ప అమ్మకాలను సాధించడమే కాకుండా, Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ స్మార్ట్ ఫోన్, వినియోగదారుల చేత అత్యున్నతమైన రేటింగ్ అందుకున్న స్మార్ట్ ఫోనుగా నిలిచింది. ఇది మొత్తంగా 20,000 వేలకు పైగా వినియోదారుల చేత 5 రేటింగ్ కు గాను 4.6 రేటింగ్ తో టాప్ స్థానాన్ని అందుకుంది.

అంతేకాదు, ఇప్పుడు POCO సంస్థ తెలిపిన ప్రకారం, ఈ పోకో X2 స్మార్ట్ ఫోన్ బాక్స్ నుండి బయటికి వస్తూనే ఆండ్రాయిడ్ 10 తో పాటుగా వస్తుంది. కానీ, ఈ ఫోన్ త్వరలోనే Android 11 అప్డేట్ అందుకుంటున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ ఫోన్ కొనేముందుగా దీని యొక్క ఈ టాప్-5 ఫీచర్ల గురించి తెలుసుకోండి.

1. డిస్ప్లే

ఈ POCO X2 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని ప్రీమియం ఫోన్లలో మాత్రమే అందించే డిజైనుతో అందించింది. అదేమిటంటే, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)   ప్రస్తుతం ఈ ధరలో ఈ ఫీచరుతో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి మాత్రమే అవుతుంది. ఇది ఒక 6.67 అంగుళాల పరిమాణం డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొ క్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10 కి సపోర్ట్ చేయగల 120Hz డిస్ప్లేతో వస్తుంది.                                     

2. ప్రాసెసర్

ఇది క్వాల్కామ్ యొక్క గేమింగ్ ప్రత్యేకమైన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 730G  ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది Adreno 618 GPU తో మీకు మంచి గ్రాఫిక్స్ అందిస్తుంది మరియు PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషన్ ఆడవచ్చు.  ఈ POCO X2 స్మార్ట్  ఫోనులో ఒక లిక్విడ్ కూలింగ్ టెకెబనాలజీని కూడా కలిగి ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2.2 Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

1. POCO X2 6GB ర్యామ్  + 64GB స్టోరేజి : Rs.15,999/-

2. POCO X2 6GB ర్యామ్  + 128GB స్టోరేజి : Rs.16,999/-

3. POCO X2 8GB ర్యామ్  + 256GB స్టోరేజి : Rs.19,999/-

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.89 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సారుతో ఇంచింది. ఈ ధరలో ఈ కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.2 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP డెప్త్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విశాయిని వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీలే కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 20MP మరియు 2MP  సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో 960fps వద్ద సూపర్ స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ పోకో X2 ని ఒక అతిపెద్ద 4,700mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 27W ఛార్జర్ కూడా అందించింది.  అలాగే, ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో కూడా వస్తుంది.                              

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
poco x2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 9999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
₹ 15499 | $hotDeals->merchant_name
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
₹ 23999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | Extra 2000 Off on Coupon | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | Extra 2000 Off on Coupon | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status