భారీ ఆఫర్లతో పోకో లేటెస్ట్ 5G ఫోన్ ఫస్ట్ సేల్..ఎప్పుడంటే.!

HIGHLIGHTS

Poco F5 భారీ ఆఫర్లతో మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతోంది

పోకో ఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ను పోకో రూ. 29,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది

Poco F5 5G లేటెస్ట్ సూపర్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 7+ Gen 2 తో వచ్చింది

పోకో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Poco F5 భారీ ఆఫర్లతో మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతోంది. స్మార్ట్ ఫోన్ 12-bit ప్యానల్ మరియు OIS సపోర్ట్ మరియయు 7Film ఫీచర్ సపోర్ట్ కలిగిన కెమేరా వంటి వివరాలతో లాంచ్ అయిన ఈ ఫోన్ మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు మరియు అఫర్ వివరాలు ఇక్కడ చూడవచ్చు. 

Poco F5: ధర మరియు ఆఫర్లు

పోకో ఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ను పోకో రూ. 29,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఈ ఫోన్ బేసిక్ (8GB+256GB) వేరియంట్ ధర మరియు (12GB+256GB) వేరియంట్ ధర రూ. 33,999. మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనే కస్టమర్లు రూ. 3,000 డిస్కౌంట్ ను, ఎక్స్ చేంజ్ అఫర్ తో ఈ ఫోన్ ను కొనే వారు రూ. 3,000 అదనపు ఎక్స్ చేంజ్ తగ్గింపు ను పొందుతారు. 

Poco F5: స్పెక్స్ & ఫీచర్స్

Poco F5 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ సూపర్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 7+ Gen 2 తో వచ్చింది. ఈ ఫోన్ లో Dolby Vision సపోర్ట్ కలిగిన 120Hz రిఫ్రెష్ రేట్ 12-Bit డిస్ప్లేని పోకో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ 12 LPDDR5 ఫాస్ట్ RAM మరియు 256 GB UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ వుంది. 

ఈ ఫోన్ 64MP (OIS) + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు 16MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ లో వున్నా రియర్ కెమేరాతో 4K వీడియోలను 30 fps వద్ద షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ Android 13 OS తో MIUI 14 సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ 67W టర్బో ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :