ఇండియాలో లాంచ్ కానున్న POCO X2 స్మార్ట్ ఫోన్

ఇండియాలో లాంచ్ కానున్న POCO X2 స్మార్ట్ ఫోన్

2018 సంవత్సరంలో, కేవలం మిడ్ రేంజ్ ధరలో వేగవంతమైన ప్రాసెసర్ తో వచ్చినటువంటి స్మార్ట్ ఫోనుగా, POCO F1 ప్రసశంసలు అందుకుంది. ఈ ఫోన్, కేవలం 20,000 రూపాయల ధరలో అప్పటి హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఒక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఆతరువాత, షావోమి యొక్క ఉప బ్రాండ్ అయిన ఈ POCO నుండి మరొక స్మార్ట్ ఫోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. అయితే, ఇప్పుడు ఆశ్చర్యకరంగా 2020 ఫిబ్రవరి 4 వ తేదికి ఈ POCO తన తరువాతి ఫోన్ POCO F2 ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.   

 

 

త్వరలో రానున్న ఈ పోకో F2 స్మార్ట్ ఫోన్ యొక్క విడుదల తేదీతో పాటుగా కొన్ని ప్రత్యేకతలను కూడా ప్రకటించింది. పోకో తన అధికారిక ట్విట్టర్ పేజీలో అందించిన టీజర్ ద్వారా, ఈ ఫోన్ గొప్ప డిస్ప్లే, స్పీడ్ ప్రాసెసర్ మరియు హై ఎండ్ కెమేరాతో రానున్నట్టు అర్ధమవుతోంది.

అంతేకాదు, ఈ ఫోన్ యొక్క అనౌన్స్ మెంట్ ను Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన  మైక్రో సైట్ ద్వారా కూడా చూపిస్తోంది. అంటే, ఈ ఫోన్ యొక్క ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా  ఫ్లిప్కార్ట్ ఉందనున్నది కావచ్చు. ఇక ఈ ఫోన్ గురించి ఫ్లిప్కార్ట్ నుండి అందిస్తున్న టీజర్ ప్రకారం, ఈ ఫోన్ ఒక గొప్ప కెమేరాతో రానున్నట్లు చెబుతోంది. అధనంగా, ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి కూడా గొప్పగా చెబుతోంది. అదేమిటంటే, "స్మూత్ హయ్యర్ రిఫ్రెష్ రేట్" అనిచెబుతోంది. అంటే, రానున్న ఈ F2 ఫోన్ ఎక్కువ రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేతో ఉండనున్నట్లు అర్ధమవుతోంది.                             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo