Poco C61: పోకో నుండి కొత్త బడ్జెట్ ఫోన్ లాంఛ్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Poco C61: పోకో నుండి కొత్త బడ్జెట్ ఫోన్ లాంఛ్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
HIGHLIGHTS

పోకో ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Poco C61 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో వచ్చింది

ఈ కొత్త ఫోన్ ను బడ్జెట్ ధరలో తగిన ఫీచర్స్ తో విడుదల చేసింది

Poco C61: పోకో ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. పోకో C61 పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో వచ్చింది. ఇప్పటికే C Series నుండి చాలా ఫోన్ లను అందించిన పోకో ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ను బడ్జెట్ ధరలో తగిన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ పోకో కొత్త ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు పైన ఒక లుక్కేద్దాం పదండి.

Poco C61: Price

పోకో సి61 స్మార్ట్ ఫోన్ (4 GB + 64 GB) వేరియంట్ ను రూ. 7,499 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క (6 GB + 128 GB) వేరియంట్ ను రూ. 8,499 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి 28వ తేది నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది.

Also Read: భారీ Jio Offer తో Realme Narzo 70 Pro 5G సేల్ ప్రారంభం.!

Poco C61: ప్రత్యేకతలు

పోకో C61 స్మార్ట్ ఫోన్ కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో లాంఛ్ అయ్యింది. ఇది ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ లో కెమేరా సెటప్ చుట్టూ పెద్ద రింగ్ డిజైన్ తో ఉంటుంది. ఈ పోకో కొత్త ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు Gorilla Glass 3 రక్షణ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Mediatek బడ్జెట్ ప్రోసెసర్ Helio G36 తో పని చేస్తుంది. అలాగే, 6GB వరకూ ర్యామ్ మరియు 128GB వరకూ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Poco C61 Display
Poco C61 Display

పోకో C61 లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 8MP మెయిన్ కెమేరా వుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈఆ ఫోన్ లో చాలా కెమేరా ఫిల్టర్లతో పాటుగా 1080p (30fps) వీడియో రికార్డ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ లో Bluetooth Version v5.4 సపోర్ట్ వుంది మరియు ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS తో నడుస్తుంది.

Poco C61 Battery
Poco C61 Battery

ఇక ఈ ఫోన్ యొక్క బ్యాటరీ ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 10 W Type-C చార్జ్ సపోర్ట్ వుంది. సెక్యూరిటీ పరంగా పోకో C61 ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo