భారీ Jio Offer తో Realme Narzo 70 Pro 5G సేల్ ప్రారంభం.!

HIGHLIGHTS

Realme Narzo 70 Pro 5G భారీ Jio Offer తో సేల్ కి అందుబాటులోకి వస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

బ్యాంక్ డిస్కౌంట్ మరియు జియో ఆఫర్ ను కూడా కంపెనీ అందించింది

భారీ Jio Offer తో Realme Narzo 70 Pro 5G సేల్ ప్రారంభం.!

రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme Narzo 70 Pro 5G భారీ Jio Offer తో సేల్ కి అందుబాటులోకి వస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వవస్తుంది. రియల్ మి ఈ ఫోన్ లాంఛ్ సమయంలో అందించిన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఈరోజు జరగనున్నది. మరి రియల్ మీ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు ఏమిటి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 70 Pro 5G Sale

రియల్ మి నార్జో 70 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 19,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంఛ్ చేసింది. ఇది ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర మరియు ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ ధర రూ. 21,999. ఇది ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. రియల్ మి ఈ ఫోన్ పైన గొప్ప ఆఫర్లను కూడా అందించింది.

Jio Offer & బ్యాంక్ ఆఫర్లు

ఈ ఫోన్ పైన గోపా బ్యాంక్ డిస్కౌంట్ మరియు జియో ఆఫర్ ను కూడా కంపెనీ అందించింది. HDFC మరియు ICICI బ్యాంక్స్ యొక్క క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ తో ఈ ఫోన్ కొనే యూజర్లకు రూ. 2,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, స్టార్టింగ్ వేరియంట్ పైన రూ. 1,000 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది.

Realme Narzo 70 Pro 5G Jio Offer and more
Realme Narzo 70 Pro 5G Jio Offer and more

ఇక జియో ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను కొనుగోలు చేసే జియో కొత్త మరియు పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ తో దాదాపుగా రూ. 10,000 విలువైన ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ లాభాలను పొందటానికి ఒక కండిషన్ కూడా పెట్టింది. అదేమిటంటే, రూ. 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ ఫోన్ కొనే వారు రీఛార్జ్ చెయ్యాల్సి ఉంటుంది.

Also Read: WhatsApp యూజర్లకు పండుగ లాంటి వార్త.. స్టేటస్ టైమ్ పెంచేసింది.!

ఈ రీఛార్జ్ తరువాత నెలకు రూ. 50 చొప్పున 40 నెలలకు గాను రూ. 2,000 విలువైన వోచర్ లు My Jio App లో యాడ్ చేయబడతాయి. అలాగే, రూ. 8,000 రూపాయల విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా అందించబడతాయి. కానీ, ఈ ఆఫర్ మార్చి 28వ తేదీ తో ముగుస్తుంది. ఈ బెనిఫిట్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

Realme Narzo 70 Pro 5G Jio Offer
Realme Narzo 70 Pro 5G Jio Offer

Realme Narzo 70 Pro 5G; ప్రత్యేకతలు

ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 120Hz 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే, 67W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. ఇందులో, 50MP Sony IMX890 OIS ట్రిపుల్ కెమేరా, Dimensity 7050 5G ప్రోసెసర్ మరియు Air Gestures వంటి కొత్త ఫీచర్ తో ఈ ఫోన్ వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo