ఐదు కెమెరాలతో NOKIA 9 PURE VIEW ఇండియాలో విడుదలకానుంది
త్వరలో Nokia 9 PureView స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారతదేశంలోవిడుదలకానుంది. HMD గ్లోబల్ జూన్ 6 వ తేదిన భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, దీనిలో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. కంపెనీ, దీనికి సంబంధించిన మీడియా ఆహ్వానాన్ని కూడా పంపింది.
Surveyమీడియాకి అందించిన ఈ ఆహ్వానంలో ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ గురించి ఎటువంటి వివరాలను తెలియపరచలేదు. కానీ, గ్లోబల్ లాంచ్ ముగించుకున్న ఈ 5 కెమేరాల నోకియా ఫోన్ను ఈ కార్యక్రమం ద్వారా ఇంయాలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. MWC 2019 సమయంలో, నోకియా 9 PureView ఫిబ్రవరిలో పెంటా లెన్స్ కెమెరా సెటప్తో ప్రవేశపెట్టబడింది.
నోకియా 9 ప్యూర్ వ్యూ : ప్రత్యేకతలు
నోకియా 9 ప్యూర్ వ్యూ, ఈ ఫోన్ ఇటీవల FCC ద్వారా ఆమోదించబడింది మరియు చైనాలో కూడా 3C బాడీ ఆమోదం పొందింది. ఈ ప్రధాన ఫోన్ HDR10 మద్దతుతో పాటు QHD+ రిజల్యూషన్ తో ఒక 5.99-అంగుళాల POLED డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్, హుడ్ కింద ఒక స్నాప్డ్రాగన్ 845 SoC తో ఉంటుంది. ఈ చిప్సెట్ 6GB RAM మరియు 128GB స్టోరేజి తో జత చేయబడుతుంది. 4GB RAM మరియు 128GB స్టోరేజితో పాటు ఒక సాధారణ వేరియంట్ కూడా ఉండవచ్చు.
నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ Android 9 Pie తో అమలవుతుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతునిచ్చే ఒక పెద్ద 3,320mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు IP67 ద్రువీకరణతో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ ప్రూఫ్ కూడా ఇందులో ఉంటుంది.