Oppo K13x 5G: విడుదలకు ముందే కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!
ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ వచ్చే వారం విడుదల అవుతుంది
ఒప్పో అప్ కమింగ్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ ఒప్పో రివీల్ చేసింది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది
Oppo K13x 5G: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ వచ్చే వారం విడుదల అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ మరియు ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ ను సైతం ఒప్పో రివీల్ చేసింది. ఒప్పో ప్రకారం, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో ఏ ప్రైస్ రేంజ్ లో లాంచ్ అవుతుందో తెలుసుకుందాం.
Oppo K13x 5G: ఫీచర్స్
ముందుగా ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతుందో చూద్దాం. ఈ ఫోన్ ను డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీ కలిగి ఉంటుంది మరియు IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంటే, ఈ ఫోన్ ఎక్కువ డ్యామేజ్ ను తట్టుకొనే డిజైన్ మరియు నీటి నిరోధకత వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాదు, స్క్రీన్ అవుట్ డోర్ మోడ్ మరియు గ్లోవ్ టచ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది 5G చిప్ సెట్ మరియు దీనికి జతగా 4GB / 6GB ఫిజికల్ ర్యామ్, అదనపు ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ Color OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్లో మరింత గొప్ప పెర్ఫార్మన్స్ కోసం ట్రినిటీ ఇంజిన్ కూడా జత చేసింది.
కెమెరా పరంగా, ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ + 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో AI ఎరేజర్, AI క్లారిటీ ఎన్ హెన్స్, AI పోర్ట్రైట్ మరియు AI అన్ బ్లర్ వంటి చాలా AI కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీ మరియు 45W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ 5 సంవత్సరాల మన్నిక కలిగిన బ్యాటరీ అని కూడా ఒప్పో తెలిపింది.
Also Read: iQOO Z10 Lite 5G: బడ్జెట్ ధరలో 6000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
Oppo K13x 5G: ప్రైస్
ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ అండర్ 15 వేల సెగ్మెంట్ లో కఠినమైన ఫోన్ గా వస్తోందని ఒప్పో టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ 15 వేల రూపాయల ఉప బడ్జెట్ లో లాంచ్ అవుతుందని ఒప్పో హింట్ ఇచ్చింది.