OPPO Reno 14 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త ఫోన్ సేల్.!
ఒప్పో రెనో 14 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
ఒప్పో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ ఒప్పో రెనో 14 5జి
ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది
OPPO Reno 14 5G : ఒప్పో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ ఒప్పో రెనో 14 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఆఫర్స్ మరియు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOPPO Reno 14 5G: ప్రైస్
ఒప్పో ఈ ఫోన్ మూడు వేర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) రూ. 37,999 ధరతో, రెండవ వేరియంట్ (12 జీబీ + 256 జీబీ) రూ. 39,999 మరియు హై ఎండ్ వేరియంట్ (12 జీబీ + 512 జీబీ) రూ. 42,999 రూపాయల ధరతో ఒప్పో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఆఫర్స్
ఒప్పో రెనో 14 సిరీస్ పై భారీ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై SBI, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 3,799 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు No Cost EMI ఆఫర్ కూడా అందించింది.
Also Read: Realme 15 Series సూపర్ AI ఎడిటింగ్ ఫీచర్ AI Edit Gene తో లాంచ్ అవుతోంది.!
OPPO Reno 14 5G : ఫీచర్స్
ఒప్పో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8350 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ హెవీ అంతర్గత మెమరీ కూడా అందించింది. ఈ ఫోన్ లో 6.59 ఇంచ్ OLED స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హైపర్ ఇంజిన్ మరియు AI హైపర్ బూస్ట్ వంటి గేమింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఒప్పో ఫోన్ లో 50MP మెయిన్, 50MP టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ తో మరియు అందమైన బ్యాక్ LED లైట్ తో ఆకట్టుకునేలా ఉంటుంది.