ఒప్పో ఆర్17, స్నాప్ డ్రాగన్ 670, మరియు కార్నింగ్ గెరిల్లా గ్లాస్ 6 తో రానున్న మొదటి ఫోన్ గా ఉండనుంది

HIGHLIGHTS

ఒప్పో దీని వివరాలను వెల్లడిస్తూ కంపెనీ యొక్క చైనా వెబ్సైట్ లో ఆర్17 స్పెసిఫికేషన్స్ విడుదలచేసింది.ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 670 SoC శక్తిని కలిగి ఉంది మరియు దీని డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది.

ఒప్పో ఆర్17, స్నాప్ డ్రాగన్ 670, మరియు కార్నింగ్ గెరిల్లా గ్లాస్ 6 తో రానున్న మొదటి ఫోన్ గా ఉండనుంది

ఒప్పో ఆర్17 ఇటీవల TENAA లో కనిపించింది ఇంకా దీనిని త్వరలో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు,ఈ స్మార్ట్ ఫోన్ తయారీదారు తన చైనా వెబ్సైట్లో డివైజ్ ఒక్క వివరాలను వెల్లడించింది. ఈ  కొత్త ఒప్పో ఆర్17 ఒక పెద్ద పూర్తి హెచ్ డి+ డిస్ప్లే మరియు ఒక చిన్న వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనతో మంచి డివైజ్ గా కనిపిస్తుంది. లిస్టింగ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేఇటీవల ప్రకటించిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో రక్షించబడింది మరియు  డిస్ప్లే లోనే ఒక వేలిముద్ర సెన్సార్ తో కూడా పొందుపరచబడింది. ఇది ఇప్పటికే ప్రీ – ఆర్డర్  కోసం ఉంది కానీ CNY 99999 ల నకిలీ ధరతో జాబితాచేసారు. ఈ  స్మార్ట్ ఫోన్   ఆగష్టు 18 న అమ్మకాలు వెళ్లినప్పుడు దీని ధర బయటకు వెల్లడవుతుందని భావిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఒప్పో ఆర్17 స్మార్ట్ ఫోన్ 91.5 శాతం యాస్పెక్ట్ రేషియో తో సాపేక్షంగా చిన్న నోచ్ తోకూడిన ఒక 6.4-అంగుళాల పూర్తి-హెచ్ డి+ డిస్ప్లేతో ఉంటుంది. ఇది ఇటీవలే ప్రకటించిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  670 SoC, 8జీబీ ర్యామ్ తో మరియు 128జీబీ అంతర్గత స్టోరేజి శక్తిని కలిగి ఉంది. AI- సెంట్రిక్ టాస్క్ కోసం కొత్త 10nm ప్రాసెసర్ శక్తితో ఇది    నిర్మించబడింది, మరియు క్వాల్కమ్ Kryo 360 CPU, క్వాల్కమ్ స్పెక్ట్రా 250 డ్యూయల్-కామ్ ISP, క్వాల్కమ్ AI ఇంజిన్, అడ్రినో 615 GPU మరియు స్నాప్ డ్రాగన్ X12 LTE మోడెమ్ తో వస్తుంది.  ఆర్17 ఆండ్రాయిడ్  OSO ఆధారంగా 3జి  ఆండ్రాయిడ్  ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది మరియు ఇది 3,500mAh బ్యాటరీ శక్తిని కలిగి ఉంది, ఇది సంస్థ యొక్క సొంత VOOC సాంకేతికతకు మద్దతు ఇస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్ ద్వారా కేవలం ఐదు నిమిషాల ఛార్జ్ తో రెండు గంటల టాక్ టైమ్ ని అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా,ఒప్పో ఆర్17 ఒక LED ఫ్లాష్ మాడ్యూల్ తో వెనుకవైపు 16ఎంపీ ప్రధాన  మరియు 5ఎంపీ ద్వితీయ సెన్సార్ ని అమర్చారు. ముందు ఒక f /2.0 ఎపర్చరు లెన్స్ తో 25ఎంపీ సోనీ IMX576 సెన్సార్ ఉంది. ఈ డివైజ్ కెమెరాలు AIని ఉపయోగించుకొని పిక్చెర్  మెరుగుదల మరియు సీన్ డిటక్సన్ చేస్తుందని చెబుతున్నారు. ఇది స్ట్రీమ్ బ్లూ మరియు నియాన్ పర్పల్ రంగు మోడల్స్ లో అందనున్నాయి. ఇంకా  దాన్ని పట్టుకుని చూసే యాంగిల్ ని భట్టి వివిధ రంగుల్లో కనిపించే విధంగా డిజైన్ చేసారు.

ఒప్పో త్వరలో భారతదేశంలో F9 ప్రో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు, ఇది కూడా వాటర్డ్ డ్రాప్ నోచ్ డిజైన్ తో పాటుగా, VOOC స్పీడ్ ఛార్జింగ్ సామర్థ్యాలను మరియు ఒక గ్రేడియంట్  బ్యాక్ ప్యానెల్ రూపకల్పనతో వస్తుంది. సంస్థ ఇప్పటివరకు వెల్లడించిన చిత్రాల నుండి, డివైజ్ యొక్క వెనుకవైపు క్షితిజ సమాంతరంగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ తో  వస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఒప్పో బ్రాండింగ్ తో  పాటు కెమెరాల క్రింద  వెనుక భాగంలో ఉంచారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo