OPPO డోర్ డెలివరీ: ఒప్పో ఫోన్లు ఇక నేరుగా ఇంటికే డెలివరీ

OPPO డోర్ డెలివరీ: ఒప్పో ఫోన్లు ఇక నేరుగా ఇంటికే డెలివరీ
HIGHLIGHTS

ఒప్పో ఫోన్లు ఇక నేరుగా ఇంటి వద్దకే డెలివరీ

Whatsapp నుండి ఒక టెక్స్ట్ మెసేజ్ ను పంపేస్తే సరిపోతుంది

ఒప్పో మొబైల్ ను సెలక్ట్ చేసుకొని అన్ని వివరాలను పొందవచ్చు

ఒప్పో సంస్థ ఇక తన ఫోన్లను నేరుగా కస్టమర్లకు ఇంటి వద్దకే డెలివరీ చేస్తానంటోంది. మార్కెట్ ని నాడీ ని ఎప్పటికప్పుడు సరిగ్గా పట్టుకోవడం తెలిసిన ఒప్పో సంస్థ మహమ్మారి సమయంలో షాపులకు వెళ్లి ఫోన్స్ కొనుక్కోవడం కుదరని వారికోసం కొత్త పద్ధతి కూడా ప్రకటించింది. దీని కోసం చేయాల్సిందల్లా Whatsapp నుండి ఒక టెక్స్ట్ మెసేజ్ ను పంపేస్తే సరిపోతుంది.

ఇక దీని పూర్తి వివరాల్లోకి వెళితే, OPPO ఫోన్ కొనదలిచిన కస్టమర్లు 987150277 వాట్సాప్ నంబర్ కి తమ స్టేట్ మరియు పిన్ కోడ్ ను టెక్స్ట్ మెసేజ్ చెయ్యాలి. తరువాత, కస్టమర్లకు వారికీ అతి దగ్గరలోని రిటైల్ స్టోర్ నుండి తిరిగి కాల్ వస్తుంది. ఆ కాల్ బ్యాక్ తో కావాల్సిన ఒప్పో మొబైల్ ను సెలక్ట్ చేసుకొని అన్ని వివరాలను పొందవచ్చు మరియు ఇంటి వద్దకే డోర్ డెలివరీని కూడా పొందవచ్చు.

ఇప్పటికే, ఒప్పో కస్టమర్లకు చేరువవ్వడానికి అనేక సులభమైన మార్గాలతో పాటుగా ఇప్పుడు డోర్ డెలివరీని కూడా తీసుకొచ్చింది. ఇక ఒప్పో ఫోన్ అభిమానులకు కొత్త డోర్ డెలివరీతో ఇంటి నుండి బయటకి వెళ్లకుండానే కొత్త ఒప్పో ఫోన్ ను ఇంటికే డోర్ డెలివరీ తెప్పించుకునే వీలుంటుంది. వీటితో పాటుగా అందుబాటులో వున్నా అన్ని అఫర్ మరియు ఫోన్ వివరాలను కూడా  మీరు తెలుసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo