Oppo Reno 4 Pro భారీ ఫీచర్లతో వచ్చింది : ప్రైస్, స్పెక్స్, కెమేరా…మరిన్ని వివరాలు

HIGHLIGHTS

Oppo Reno 3 Pro యొక్క వారసుడిగా Oppo Reno 4 Pro భారతదేశంలో లాంచ్ అయ్యింది.

Oppo Reno 4 Pro 65W ఫాస్ట్ ఛార్జింగ్, క్వాడ్ కెమెరా, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ఇంకా మరెన్నో భారీ ఫీచర్ల మద్దతుతో వస్తుంది.

రెనో 4 ప్రో ఆగస్టు 5 నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్ ‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లలో అమ్మకానికి వస్తుంది.

Oppo Reno 4 Pro భారీ ఫీచర్లతో వచ్చింది : ప్రైస్, స్పెక్స్, కెమేరా…మరిన్ని వివరాలు

Oppo Reno 3 Pro యొక్క వారసుడిగా Oppo Reno 4 Pro భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్, వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ఇంకా మరెన్నో భారీ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. Oppo Reno 4 Pro జూన్ నెలలో ఒప్పో ప్రకటించిన రెనో 4 సిరీస్‌లో భాగం అవుతుంది.  అయితే, భారతీయ వేరియంట్ దాని చైనీస్ కౌంటర్ కంటే కొంచెం భిన్నమైన ఫీచర్స్ ‌తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఉదాహరణకు : ఇండియన్ Reno 4 Pro స్నాప్ ‌డ్రాగన్ 765 జి కాకుండా క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 720 జి చిప్ ‌సెట్ యొక్క శక్తితో వస్తుంది. ఇది ఇటీవల ప్రారంభించిన వన్ ‌ప్లస్ నార్డ్‌ లో మనం చూశాము. Oppo Reno 4 Pro యొక్క ఫీచర్లు, ధర మరియు లభ్యత గురించి క్లుప్తంగా చూద్దాం.

Oppo Reno 4 Pro Price

ఒప్పో రెనో 4 ప్రో 8 జీబీ ర్యామ్ ‌తో బేస్ వేరియంట్ రూ .34,990 వద్ద ప్రారంభమవుతుంది.

Oppo Reno 4 Pro First Sale

రెనో 4 ప్రో ఆగస్టు 5 నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్ ‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లలో అమ్మకానికి వస్తుంది.

Oppo Reno 4 Pro స్పెసిఫికేషన్స్ 

ఒప్పో రెనో 4 ప్రో చాలా సన్నని మరియు తేలికైనదిగా వుంటుంది మరియు వెనుక భాగంలో యాంటీ-గ్లేర్ మాట్టే ఫినిషింగ్ తో వస్తుంది, ఇది మృదువైన-టచ్ అనుభూతిని ఇస్తుంది. ఇది 7.7 మిల్లీమీటర్ల మందం మరియు 161 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ లో ఒక 6.5-అంగుళాల Full HD +  రిజల్యూషన్ AMOLED స్క్రీన్ 90Hz హై-రిఫ్రెష్-రేట్ మరియు సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న సింగల్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తుంది.

రెనో 4 ప్రో క్వాల్‌కామ్ స్నాప్ ‌డ్రాగన్ 720 G  ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన Color OS 7.2  పై నడుస్తుంది.

Oppo Reno 4 Pro Camera

ఒప్పో రెనో 4 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 MP ఎఫ్ / 1.7 ఎపర్చరు, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP  మోనోక్రోమ్ కెమెరా మరియు 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. వెనుక కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతుతో 30 fps వద్ద 4 K రిజల్యూషన్లతో షూటింగ్ చేయగలవు. ముందు భాగంలో, పంచ్-హోల్ కటౌట్ లోపల ఉంచబడినది 32MP సెల్ఫీ కెమెరా వుంటుంది.

Oppo Reno 4 Pro Battery

ఇది Super VooC 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా 65W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు కలిగిన 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఒప్పో వాదనల ప్రకారం 36 నిమిషాల్లో 0-100% వరకూ అత్యున్నత వేగంతో ఛార్జ్ చేయగల సత్తా ఈ ఫోనుకు వుంది.                                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo