Oppo K13 Turbo Series : ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోంది.!

HIGHLIGHTS

Oppo K13 Turbo Series స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టిన ఒప్పో

ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెక్స్ మరియు ఫీచర్లు రిలీజ్ చేసింది

ఈ ఫోన్ ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా ఇండియాలో అడుగుపెడుతోంది

Oppo K13 Turbo Series : ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోంది.!

Oppo K13 Turbo Series స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టిన ఒప్పో, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెక్స్ మరియు ఫీచర్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా ఇండియాలో అడుగుపెడుతోంది. ఈ టీజర్ పేజీ నుంచి కంపెనీ విడుదల చేసిన ఆ కీలక స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K13 Turbo Series : లాంచ్

ఒప్పో కె 13 టర్బో సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ కీలక స్పీక మరియు ఫీచర్లు విడుదల చేసింది.

Oppo K13 Turbo Series : ఏమిటా కీలక స్పెక్స్?

ఒప్పో కె 13 టర్బో సిరీస్ ఫోన్లు ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి మరియు ఇండియాలో ఏకైక ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఈ ఫీచర్ గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఇందులో అందించిన ఫ్యాన్ ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబరుస్తుందని ఒప్పో తెలిపింది. ఈ ఫ్యాన్ ను స్టోర్మ్ ఇంజిన్ కూల్ టెక్నాలజీ అని ఒప్పో పిలుస్తోంది. ఇందులో, కేవలం ఫోన్ కెమెరా సైజులో ఉండే చాలా చిన్నదైన మైక్రో ఫ్యాన్ ఉంటుంది.

ఈ ఫోన్ ఫ్యాన్ ఇంత చిన్నగా ఉన్నా ఇందులో కేవలం 0.1 మిల్లీమీటర్ సైజులో ఉండే 13 రెక్కలు ఉంటాయి. ఈ ఫోన్ ను చల్లబరచడానికి కేవలం ఫ్యాన్ మాత్రమే కాదు 7000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ రెండింటి కలయికలో ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబడుతుంది, అని ఒప్పో ఈ ఫోన్ గురించి పొగుడుతోంది.

Oppo K13 Turbo Series

ఈ ఫోన్ డిజైన్ కూడా కొత్త ఉంటుంది, ఒప్పో ఇప్పటి వరకు అందించని కొత్త నియాన్ టర్బో డిజైన్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ డిజైన్ తో పాటు ఆకట్టుకునే మూడు అందమైన రంగుల్లో కూడా ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఇందులో, సిల్వర్ నైట్, పర్పల్ ఫాంటమ్ మరియు మిడ్ నైట్ మెవరిక్ ముందు రంగులు ఉంటాయి. ఈ ఫోన్ లో కలిగిన ఫ్యాన్ తో పాటు ఫోన్ కలర్ లో ఉండే బ్రీతింగ్ LED లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ ఫ్యాన్ తో పాటు ఆన్ అవుతుంది మరియు ఫ్యాన్ తో పాటు ఆఫర్ అవుతుంది.

Also Read: అండర్ రూ. 25,000 ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి లభించే బెస్ట్ 55 ఇంచ్ 4K Smart TV

ఇక ఈ ఫోన్ డిజైన్ మరియు టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉన్నట్లు క్లియర్ చేసింది. అంతేకాదు, ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు టైప్ C ఛార్జ్ పోర్ట్ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన స్పెక్స్ కూడా త్వరలోనే ఒప్పో వెల్లడిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo