అండర్ రూ. 25,000 ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి లభించే బెస్ట్ 55 ఇంచ్ 4K Smart TV
ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
బడ్జెట్ ధరలో 55 ఇంచ్ 4K Smart TV కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో వుంది
ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చవక ధరలో లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. బడ్జెట్ ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
Surveyఏమిటా బెస్ట్ 55 ఇంచ్ 4K Smart TV ఆఫర్?
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ విషయానికి వస్తే, Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు మంచి తగ్గింపు మరియు మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ టీవీ 61% భారీ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ అందించింది, ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది.

అలాగే, ఈ స్మార్ట్ టీవీ పై ICICI మరియు BOBCARD EMI ఆఫర్ తో రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,499 రూపాయల ధరలో లభిస్తుంది.
Also Read: Samsung కొత్త ఫోన్ Galaxy F36 5G పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale భారీ ఆఫర్లు అందుకోండి.!
Daiwa 55 ఇంచ్ 4K Smart TV : ఫీచర్లు
ఈ డైవా స్మార్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10 సపోర్ట్ మరియు ALLM సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ARM క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, Av ఇన్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
ఈ డైవా స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ మరియు మంచి స్టాండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్ స్టార్ వంటి అన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile