సరసమైన ధరలో వచ్చిన Oppo 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఎల్లుండి మొదలవుతుంది. ఈ వారం ప్రారంభంలో భారత మార్కెట్ లో ఒప్పో విడుదల చేసిన సరసమైన 5జి స్మార్ట్ ఫోన్ OPPO K12x 5G మొదటి సేల్ ఎల్లుండి మొదలువుతుంది. ఈ ఫోన్ ను ఒప్పో కేవలం రూ. 12,999 ధరలో ఆకర్షణీయమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి మంచి ఆఫర్లు కూడా పొందవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
OPPO K12x 5G : ధర మరియు ఆఫర్లు
ఒప్పో ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను కేవలం రూ. 12,999 ధరలో అందించింది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 15,999 ధరతో అనౌన్స్ చేసింది. ఎల్లుండి అనగా ఆగస్టు 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. Flipkart మరియు oppo.com నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.
ఒప్పో ఈ లేటెస్ట్ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్ ను కూడా అందించింది. HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ఒప్పో K12x 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఒప్పో K12x 5G స్మార్ట్ ఫోన్ మిలటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కలిగిన 360° డామేజ్- ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో వస్తుంది మరియు IP54 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన HD డిస్ప్లే వుంది. K12x 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256 హెవీ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
OPPO K12x 5G
ఈ ఫోన్ 32MP మెయిన్ మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ లు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. కె 12x 5G ఫోన్ 45W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది.