oppo find x9s
OPPO Find X9s: ఒప్పో ఈరోజు రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s ఫోన్ బేసిక్ వేరియంట్ గా లాంచ్ అయ్యింది. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ మంచి డిజైన్ మరియు బ్రిలియంట్ ఫీచర్స్ తో చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్ సూపర్ డీటెయిల్స్ అందించే HASSELBLAD కెమెరా మరియు సూపర్ పెర్ఫార్మెన్స్ అందించే లేటెస్ట్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s స్మార్ట్ ఫోన్ ను రెండు లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇక్కడ చూడవచ్చు.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s (12GB + 256GB) ప్రైస్ :రూ. 79,999
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s (12GB + 256GB) ప్రైస్ :రూ. 89,999
ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను రోజు నుంచి స్టార్ చేసింది మరియు ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ సన్ సెట్ ఆరెంజ్, మిడ్ నైట్ గ్రే మరియు లావెండర్ స్కై అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s పై ఫ్లాట్ 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ పై గరిష్టంగా రూ. 8,999 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు ఉచిత ఇయర్ బడ్స్ ఆఫర్ ను కూడా ఒప్పో ప్రకటించింది.
Also Read: OPPO Find X9 Ultra: మొబైల్ ఫోన్ చరిత్రలో చూడని అద్భుతమైన కెమెరాతో లాంచ్ అయ్యింది.!
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s చాలా కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ మీడియాటెక్ Dimensity 9500s ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ జతగా 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ అందించింది.
ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ లో వెనుక 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఒప్పో అందించింది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, 60FPS 4K వీడియో రికార్డింగ్, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఒప్పో యోక్క ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ 7025 mAh బిగ్ బ్యాటరీ మరియు 800W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇండస్ట్రీ లీడింగ్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో వస్తుంది. అంటే, గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది.