Oppo K13 5G: ఒప్పో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే, ఒప్పో కె 13 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ సిరీస్ లో ముందుగా వచ్చిన ఫోన్స్ కు నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ అప్ కమింగ్ ఫోన్ వస్తుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ఫోన్స్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ప్రత్యేకతలను కలిగి వున్నాయి.
Survey
✅ Thank you for completing the survey!
Oppo K13 5G : లాంచ్
ఒప్పో కె 13 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుందని ప్రకటించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీ నుంచి కేవలం ఫోన్ పేరుతో మాత్రమే టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ లో “Launching 1st in India” అని అందించిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను మొదటిగా ఇండియాలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
ఈ ఫోన్ గత జెనరేషన్ ఫోన్ ఒప్పో కె12x గొప్ప ఫీచర్స్ తో మార్కెట్ లో మంచి స్థానాన్ని అందుకుంది. ఒప్పో కె12x స్మార్ట్ ఫోన్ ను డేమేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీ, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్, స్లీక్ డిజైన్ మరియు మంచి కెమెరా సెటప్ తో వచ్చింది.
గత జనరేషన్ తో పోలిస్తే, ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె13x ను మరింత ఆకర్షణీయమైన లేటెస్ట్ ఫీచర్స్ తో అందించే అవకాశం ఉండవచ్చు. ఈ అప్ కమింగ్ ఫోన్ ను పెద్ద స్క్రీన్, ఆకట్టుకునే కెమెరా, స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఒప్పో కె 13 5జి ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటకి వెల్లడించే అవకాశం ఉండవచ్చు.