OnePlus Pad Go 2: బిగ్ బ్యాటరీ మరియు 5G చిప్ సెట్ తో వచ్చింది.!
వన్ ప్లస్ ఈరోజు OnePlus Pad Go 2 లాంచ్ చేసింది
కొత్త ప్యాడ్ ను గొప్ప బ్యాకప్ అందించే బిగ్ బ్యాటరీ మరియు 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది
ఈ లేటెస్ట్ బ్యాడ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి
OnePlus Pad Go 2: వన్ ప్లస్ ఈరోజు బెంగళూరు లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం నుంచి ఈరోజు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాడ్ ను గొప్ప బ్యాకప్ అందించే బిగ్ బ్యాటరీ మరియు 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు ఈ కొత్త పాడను స్టైలిష్ సపోర్ట్ తో కూడా విడుదల చేసింది. వన్ ప్లస్ సరి కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బ్యాడ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyOnePlus Pad Go 2: ప్రైస్
వన్ ప్లస్ ఈ కొత్త ప్యాడ్ ను రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఇందులో బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 24,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్యాడ్ హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 26,999 ప్రైస్ తో అందించింది. అయితే, వి రెండు కూడా WiFi ఓన్లీ ప్యాడ్ లు మాత్రమే అని గమనించాలి. ఈ ప్యాడ్ 5జి వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) ధర రూ. 31,999 గా ప్రకటించింది. ఈ లేటెస్ట్ ప్యాడ్ షాడో బ్లాక్ మరియు లావెండర్ డ్రిఫ్ట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఆఫర్స్
ఈ ప్యాడ్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్యాడ్ ముందుగా తీసుకునే యూజర్లకు స్టైల్స్ పెన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ఇది ముందుగా ఫోన్ బుక్ చేసుకునే వారికి మాత్రమే అని గమనించాలి. రూ. 4,000 భారీ తగ్గింపు మరియు మరిన్ని ఆఫర్లు కూడా వన్ ప్లస్ ఈ ప్యాడ్ పై అందించింది.
OnePlus Pad Go 2: ఫీచర్స్
ఇక ఈ లేటెస్ట్ వన్ ప్లస్ యాడ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ వన్ ప్లస్ ప్యాడ్ కేవలం 6.83mm మందంతో అల్ట్రా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది 12.1 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో లాంచ్ అయింది. ఈ డిస్ప్లే 12 బిట్ కలర్ డెప్త్,120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ HBM బ్రైట్నెస్, 2.8K రిజల్యూషన్ మరియు డాల్బీ విజన్ సప్పోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ గో 2 మీడియాటెక్ Dimensity 7300-Ultra 5G ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో వేగవంతమైన 8 జీబీ LPDDR5x ర్యామ్ మరియు 256 జీబీ బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ముందు 8MP సెల్ఫీ కెమెరా మరియు వెనుక 8MP సింగల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Wi-Fi 6 తో పాటు 5G కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ప్యాడ్ 10,050mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ టైప్ C ఛార్జ్ పోర్ట్ తో 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది. ఇది వన్ ప్లస్ లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఆక్సిజన్ 16 తో లాంచ్ అయ్యింది మరియు ఇది ఆండ్రాయిడ్ 16OS తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది.
Also Read: OnePlus 15R 5G: పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ ప్యాడ్ ను స్టైల్స్ సపోర్ట్ తో అందించినా బాక్స్ తో మాత్రం స్టైల్స్ ను అందించడం లేదు. ఈ స్టైల్స్ స్మార్ట్ పెన్ ను మీరు విడిగా తీసుకోవాలి. అయితే, బాక్స్ లో 45W సూపర్ ఊక్ ఛార్జర్ అందిస్తుంది.