OnePlus Nord ప్రీ -బుకింగ్ స్టార్ట్ : అఫీషియల్ డిజైన్ కూడా రిలీజ్ చేసింది

OnePlus Nord  ప్రీ -బుకింగ్ స్టార్ట్  : అఫీషియల్ డిజైన్ కూడా రిలీజ్ చేసింది
HIGHLIGHTS

ఈరోజు నుండి Amazon India నుండి OnePlus Nord Pre-Booking కూడా మొదలు పెట్టింది.

OnePlus Nord Launch Event కోసం ప్రపంచంలో మొదటి AR ఈవెంట్‌ను హోస్ట్ చేస్తోం

ఇప్పటికే, OnePlus Nord Specs కి సంబంచింది అనేక విషయాలు నెటింట్లో చక్కర్లు కొడుతుంటే, వన్ ప్లస్ మాత్రం ఈ రానున్న సరసమైన స్మార్ట్ ఫోన్ గురించి మాత్రం జోరుగానే ప్రచారం చేస్తోంది.

OnePlus Nord స్మార్ట్ ఫోన్ను ఇండియాలో జూలై 21 న ఆవిష్కరించడానికి డేట్ ఫిక్స్ చేసిన వన్ ప్లస్ సంస్థ, ఈ ఫోను గురించిన వివరాలను షేర్ చెయ్యడం మాత్రం మానుకోలేదు. ఇప్పటికే, OnePlus Nord Specs కి సంబంచింది అనేక విషయాలు నెటింట్లో చక్కర్లు కొడుతుంటే, వన్ ప్లస్ మాత్రం ఈ రానున్న సరసమైన స్మార్ట్ ఫోన్ గురించి మాత్రం జోరుగానే ప్రచారం చేస్తోంది. అంతేకాదు, ఈరోజు నుండి Amazon India నుండి OnePlus Nord Pre-Booking కూడా మొదలు పెట్టింది.

OnePlus Nord Pre-Booking 

వన్ ప్లస్ నుండి రానున్న సరసమైన స్మార్ట్  "వన్ ప్లస్ నార్డ్"  ని అందరికంటే ముందుగా తమ సొంతం చేసుకోవాలని చూసేవారి కోసం OnePlus Nord Pre-Booking ని కూడా అమేజాన్ ఇండియా నుండి ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుండి మొదలు పెటింది. కాబట్టి, నేరుగా అమెజాన్ లేదా పైన వన్ ప్లస్ ప్రీ బుక్ పైన నొక్కడం ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు.

OnePlus Nord Launch Event

ఇక మరొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే, వన్‌ ప్లస్ తన సరసమైన స్మార్ట్‌ ఫోన్ వన్‌ ప్లస్ నార్డ్ ‌ను ప్రారంభించడం కోసం ప్రపంచంలో మొదటి AR ఈవెంట్‌ను హోస్ట్ చేస్తోంది మరియు ఈ లైవ్ స్ట్రీమ్ చూడడానికి మీకు కావాల్సిన AR APP ని ఇప్పటికే  Play Store మరియు యాప్ స్టోర్‌లో ప్రారంభించింది.

OnePlus Nord Leaked స్పెసిఫికేషన్స్

వన్ ‌ప్లస్ నార్డ్ 6.55-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగి ఉందని రూమర్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఫోన్‌లో మూలలో డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ ఉండవచ్చని ఈ లీక్స్ సూచించాయి.

ఈ ఫోన్‌ను క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి చిప్‌సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 620 జిపియుతో కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడింది మరియు మరిన్ని వేరియంట్‌లు కూడా ఉండవచ్చు.

వన్‌ ప్లస్ నార్డ్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు, ఇందులో ప్రాధమిక 64 ఎంపి కెమెరా, 16 ఎంపి అల్ట్రా-వైడ్-కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, సెల్ఫీలు కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మద్దతు ఉన్న 32MP ప్రాధమిక కెమెరా ఉంది.

ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌కు మద్దతుతో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడిందనే రూమర్ కూడా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo