OnePlus Nord CE6 sale starts from 8 may 2026
OnePlus Nord CE6 స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే సేల్ డేట్ ను వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల లాంచ్ అవుతుంది మరియు లాంచ్ అయిన తర్వాత రోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుందని వన్ ప్లస్ కొత్త అప్డేట్ అందించింది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ టీజర్ ఫీచర్స్ తో ఈ ఫోన్ పై హైప్ ను పెంచిన వన్ ప్లస్, ఈ ఫోన్ సేల్ డేట్ అనౌన్స్ చేసి మరోసారి ఈ ఫోన్ గురించి వార్తల్లో నిలిచింది.
వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన నెక్స్ట్ డే అంటే, మే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ కూడా స్టార్ట్ అవుతుందని వన్ ప్లస్ తెలిపింది.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, గేమింగ్ కోసం అవసరమైన ప్రత్యేకమైన టచ్ రిఫ్లెక్స్ చిప్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫైన్ AI సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో ఉన్నా కూడా భారీ 8000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Flipkart బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి Air Coolers పై గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది.!
ఈ ఫోన్ మరిన్ని ఇతర ఫీచర్స్ కూడా వన్ ప్లస్ వెల్లడించింది. వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ `IP66, IP68, IP69 మరియు IP66K రేటింగ్ తో గొప్ప వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆక్సిజన్ 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.