OnePlus Nord CE3 Lite 5G: ధర, స్పెక్స్ మరియు ఆఫర్ల పైన ఒక లుక్కేద్దామా.!
వన్ ప్లస్ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE3 Lite 5G
ఏప్రిల్ 11 నుండి ఈ స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది
వన్‌ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది
వన్ ప్లస్ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE3 Lite 5G ఇండియాలో లాంచ్ అయ్యింది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ డిజైన్ మరియు కొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చినట్లు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 108 MP బిగ్ సెన్సార్ ని అదికూడా 3X లాస్ లెస్ జూమ్ తో అందించడం గురించి ప్రత్యేకంగా చెబుతోంది. మరి త్వరలో సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఆఫర్ల పైన ఒక లుక్కేద్దామా.
SurveyOnePlus Nord CE3 Lite 5G: ధర మరియు ఆఫర్లు
వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.19,999. OnePlus Nord CE3 Lite 5G యొక్క రెండవ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.21,999.
ఏప్రిల్ 11 నుండి ఈ స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను MobiKwik Wallet తో MBK2000 కోడ్ ద్వారా కొనేవారికి 2,000 క్యాష్ బ్యాక్ అఫర్ ను కూడా కంపెనీ అందించింది.
OnePlus Nord CE3 Lite 5G: స్పెక్స్
వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ 5G పెద్ద 6.72 -ఇంచ్ (2400 X 1080) రిజల్యూషన్ గల LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 695 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఇది ఆక్సిజన్ 13.1 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది.
కెమెరాల విభాగంలో, ఈ వన్‌ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 108MP ప్రాధమిక కెమెరాకి (Samsung S5KHM6SX03) జతగా 2MP మ్యాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ కెమేరాని జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.
వన్‌ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 67W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
