OnePlus N6x launched with big battery like features under budget price
OnePlus N6x : వన్ ప్లస్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్6ఎక్స్ ఈ రోజు భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ లో బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వన్ ప్లస్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ N6 సిరీస్ నుంచి విడుదలైన రెండో ఫోన్ మరియు బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ పూర్తిగా తెలుసుకుందామా.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (4GB + 64GB) వేరియంట్ ను రూ. 18,999 ధరతో మరియు ఈ ఫోన్ రెండో (4GB + 128GB) వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బర్గండి రెడ్ మరియు ఐస్ బ్లూ రెండు కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 4వ తేదీ 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.
ఈ ఫోన్ పై వన్ ప్లస్ గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. రూ. 1,500 రూపాయల బ్యాంక్ క్రెడిట్ అండ్ EMI ఆప్షన్ పై లభిస్తుంది. ఇది కాకుండా Bajaj కార్డు 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ తో 3 నెలల Spotify ప్రీమియం యాక్సెస్ ఇన్ ప్లస్ అందిస్తుంది.
Also Read : Amazon Great Freedom Sale టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ హింట్ ఇచ్చిన అమెజాన్.!
వన్ ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిజల్యూషన్ మరియు 900 HBM పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఐ ప్రొటెక్షన్, డార్క్ మోడ్ మరియు స్క్రీన్ కలర్ మోడ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6360 Apex ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఇందులో 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ లో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగిన 13MP దుల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఇది 30FPS FHD వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIL STD 810 H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ తో కూడా వస్తుంది.