Amazon Great Freedom Sale టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ హింట్ ఇచ్చిన అమెజాన్.!

HIGHLIGHTS

Amazon Great Freedom Sale 2026 ప్రకటించిన విషయం అందరికీ విదితమే

2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సేల్ ను అందించింది

స్మార్ట్ ఫోన్ లిస్ట్ తో కొత్త మైక్రో సైట్ టీజర్ పేజీని అమెజాన్ ఈరోజు రిలీజ్ చేసింది

Amazon Great Freedom Sale టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ హింట్ ఇచ్చిన అమెజాన్.!

Amazon Great Freedom Sale 2026 ప్రకటించిన విషయం అందరికీ విదితమే. 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సేల్ ను అందించింది. ఈ అప్ కమింగ్ సేల్ మొదలవ్వడానికి ఇంకా వారం రోజులు ఉండగా అమెజాన్ ఇప్పటి నుంచే అప్ కమింగ్ డీల్స్ గురించి టీజింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న స్మార్ట్ ఫోన్ లిస్ట్ తో కొత్త మైక్రో సైట్ టీజర్ పేజీని అమెజాన్ ఈరోజు రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Great Freedom Sale

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ తో కొత్తగా టీజర్ పేజీ ఒకటి అందించింది. ఈ టీజర్ పేజి నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ లిస్ట్ ను అందించింది.

Amazon Great Freedom Sale డీల్స్

ఈ సేల్ నుంచి యూజర్లు సెక్యూర్ చేయదగిన డీల్స్ లిస్ట్ రివీల్ చేసింది. అయితే, ఇందులో స్మార్ట్ ఫోన్ డీల్ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ప్రతి కేటగిరి నుంచి అందించనున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్ లను ఇందులో లిస్ట్ చేసింది. ఇందులో అల్ట్రా ప్రీమియం, ప్రీమియం, మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ ఉంటుంది.

అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్

ఈ కేటగిరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, వన్ ప్లస్ 15, ఐకూ 15, ఐఫోన్ 17 మరియు శాంసంగ్ లాస్ట్ గా విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్ ను కూడా లిస్ట్ చేసింది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్

ఈ లిస్ట్ లో వన్ ప్లస్ నార్డ్ 6, ఐకూ 15R, వన్ ప్లస్ 13s, షియోమీ 17T మరియు నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.

Amazon Great Freedom Sale smartphone deals

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

ఈ లిస్ట్ లో వన్ ప్లస్ 6, శాంసంగ్ గెలాక్సీ ఎం47, వన్ ప్లస్ నార్డ్ CE6 లైట్, ఐకూ Z11x మరియు రెడ్ మీ టర్బో 5 ఐదు స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.

Also Read : Samsung Galaxy F70 Pro 5G ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన శాంసంగ్.!

బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ఇక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ విషయానికి వస్తే, ఈ లిస్ట్ లో రెడ్ మీ ఏ7 ప్రో, ఐకూ జెడ్ 11 లైట్, రియల్ మీ నార్జో 100 లైట్ శాంసంగ్ గెలాక్సీ ఎం17 మరియు టెక్నో పాప్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.

ఈ పైన తెలిపిన అన్ని స్మార్ట్ ఫోన్ డీల్ అండ్ ఆఫర్ ప్రైస్ ను త్వరలోనే రివీల్ చేయబోతున్నట్లు కూడా అమెజాన్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile