OnePlus Nord CE 5G: కొత్త ఫోన్ తెస్తున్న వన్ ప్లస్ సంస్థ

HIGHLIGHTS

OnePlus Nord CE 5G: కొత్త ఫోన్ తెస్తున్న వన్ ప్లస్ సంస్థ

OnePlus Nord CE 5G లో ఇవ్వనున్న 4 మిస్టరీ ఫీచర్లు

మే 31 నుండి ఈ 4 మిస్టరీ ఫీచర్లను రివీల్ చేస్తుంది

OnePlus Nord CE 5G: కొత్త ఫోన్ తెస్తున్న వన్ ప్లస్ సంస్థ

OnePlus Nord CE 5G: కొత్త ఫోన్ తెస్తున్న వన్ ప్లస్ సంస్థ. వన్ ప్లస్, జూన్ 10 న సాయంత్రం ఒక లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ నుండి OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం Luchy Draw కార్యక్రమాన్ని కూడా తన అధికారిక వెబ్సైట్ నుండి మొదలుపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండియాలో ఇప్పటికే OnePlus Nord ని మంచి ఫీచర్లతో తక్కువ ధరలో అందించిన వన్ ప్లస్, ఈ కొత్త OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను ఎటువంటి ఫీచర్లతో తీసుకువస్తుందో చూడాలి. ఈ ఫోన్ గురించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో OnePlus Nord CE 5G లో ఇవ్వనున్న 4 మిస్టరీ ఫీచర్లను గెస్ చెయ్యమని అడుగుతుంది. అంతేకాదు, ఈ మిస్టరీ ఫీచర్లను రీవిల్ చేసే డేట్స్ ను కూడా వివరించింది.

మే 31 నుండి OnePlus Nord CE 5G ఫోనులో ఇవ్వనున్న నాలుగు మిస్టరీ ఫీచర్లలో మొదటి ఫీచర్ ను ప్రకటిస్తుంది. తరువాత, జూన్ 2 న రెండవ ఫీచర్, జూన్ 4న మూడవ ఫీచర్ మరియు జూన్ 4 న నాల్గవ ఫీచర్ ను రివీల్ చేస్తున్నట్లు డేట్స్ ప్రకటించింది. అలాగే, OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 11 న ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ. 2,699 రూపాయల విలువ గల గిఫ్ట్స్ ని కూడా ఇవ్వనున్నట్లు అఫర్ చేస్తోంది.                                         

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile