OnePlus Community Sale: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ లను కూడా భారీ డిస్కౌంట్ తో అందుకోండి.!

HIGHLIGHTS

వన్ ప్లస్ కొత్తగా ప్రకటించిన వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది

వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను సైతం భారీ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో అందుకునే అవకాశం

ఈ సేల్ నుంచి మంచి డీల్స్ తో ఒక కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు

OnePlus Community Sale: వన్ ప్లస్ కొత్తగా ప్రకటించిన వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను సైతం భారీ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో అందుకునే అవకాశం అందించింది. వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చేసే వారు ఈ సేల్ నుంచి మంచి డీల్స్ తో ఒక కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

OnePlus Community Sale: డీల్స్ ఏమిటి?

వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026 జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది మరియు జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ వన్ ప్లస్ అధికారిక సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. వన్ ప్లస్ యొక్క ఈ ప్రత్యేకమైన సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందించింది.

ఈ సేల్ నుంచి అందించిన టాప్ డీల్ విషయానికి వస్తే, వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ సిరీస్ పై అందించిన డీల్స్ గురించి చెప్పవచ్చు. అదేమిటంటే, ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 14 ఫోన్ పై రూ. 12,000 రూపాయల తాత్కాలిక ప్రైస్ కట్ మరియు రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో వన్ ప్లస్ 13 ఫోన్ ను రూ. 52,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

ఇదే సిరీస్ నుంచి అందించిన వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను కూడా బెస్ట్ డీల్స్ అందించింది. ఈ ఫోన్ పైన కూడా రూ. 2,000 రూపాయల ప్రైస్ కట్ మరియు రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Redmi Turbo 5 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

లేటెస్ట్ ఫోన్ డీల్స్

ఇక ఇటీవల వన్ ప్లస్ అందించిన స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, వన్ ప్లస్ 15 మరియు వన్ ప్లస్ 15R పై బెస్ట్ డీల్స్ అందించింది. వన్ ప్లస్ 15 ఫోన్ ను రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ తో రూ. 74,999 ధరతో మరియు వన్ ప్లస్ 15R ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 51,999 ధరతో ఈ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది.

ఇటీవల విడుదల చేసిన నార్డ్ 6 సిరీస్ పైన కూడా గొప్ప డీల్స్ అందించింది. వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ ను రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 40,999 ధరతో, నార్డ్ CE6 ని రూ. 29,999 ఆఫర్ ధరతో మరియు నార్డ్ CE6 లైట్ ఫోన్ ను 21,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :