Oneplus 7 సిరిస్ లాంచ్ : ఇండియాలో మే 14 న విడుదలకానుంది

Oneplus 7 సిరిస్ లాంచ్ : ఇండియాలో మే 14 న విడుదలకానుంది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ల కోసం " Go Beyond Speed" అనే ట్యాగ్ దీని కోసం అందించింది.

స్నాప్ డ్రాగన్ 855 తో మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చనే, భావన అందరికి కలుగుతుంది.

వన్ ప్లస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న, Oneplus 7 సిరిస్ ని విడుదల చేయడానికి వన్ ప్లస్ సంస్థ డేట్ ని సెట్ చేసింది. అట్నా వెబ్సైట్ మరియు ట్విట్టర్ పేజీలో అందించిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ల కోసం " Go Beyond Speed" అనే ట్యాగ్ దీని కోసం అందించింది. దీన్ని బట్టి చూస్తే, రానున్న ఈ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం అన్నిటికన్నా వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 855 తో మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చనే, భావన అందరికి కలుగుతుంది.

Oneplus ట్విట్టర్ పేజీలో రానున్న ఈ స్మార్ట్ ఫోన్లలో సూపర్ స్మూత్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ని చూడబోతున్నట్లు చెబుతోంది. అలాగే, డిస్ప్లే ఆపిన అందించిన ఒక ఇమేజి ప్రకారం, ఇది పెద్ద కర్వ్డ్ ఎడ్జ్ డిస్పీలో రానున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ 7 సిరీస్ ఫోనులో ఒక 5G ఎనేబుల్ ఫోనును ఒక ప్రో వేరియంట్ గా తీసుకురావచ్చని, ప్రస్తుతం వస్తున్న రూమర్లు మరియు అంచనాలతో కూడిన  నివేదికలు వివరిస్తున్నాయి.

ఇండియాలో అత్యున్నత పాపులర్ మరియు ఆల్ టైం బెస్ట్ స్మార్ట్ ఫోనుగా, Oneplus 6T అందరి మన్సులను దోచుకున్న విషయం తెలిసందే, మరి అంతకంటే మెరుగైన స్పెక్స్ తో రానున్న ఈ 7 సిరీస్ సామ్రాట్ ఫోన్లు మార్కెట్ ని ఎంతగా ప్రభావితం చేయనున్నాయో ఈ ఫోన్లు వచ్చిన తరువాత మనకు అర్ధమవుతుంది. కొన్ని, రిపోర్ట్స్ ప్రకారం, ఇది ఒక QHD రిజల్యూషన్  అందించగల కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ మరియు 8GB లేదా 10GB ఎంపికలతో అంచనా వేస్తున్నాయి.                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo