OnePlus 7 Pro Vs గూగుల్ పిక్సెల్ 3a XL : వివరణాత్మక సరిపోలిక

OnePlus 7 Pro Vs గూగుల్ పిక్సెల్ 3a XL : వివరణాత్మక సరిపోలిక
HIGHLIGHTS

ఈరోజు మనం ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ మరియు ధర ఆధారంగా ఏది ఉత్తమైన ఉత్తమైన స్మార్ట్ ఫోనుగా ఉండనుందో తెలుసుకోనున్నాము.

నిన్నజరిగిన లాంచ్ ఈవెంట్ ద్వారా  OnePlus 7 ప్రో స్మార్ట్ ఫోన్ను,  రూ 48,999  ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది వన్ ప్లస్ సంస్థ , అదే ధరలో Google పిక్సెల్ 3A XL మొబైల్ ఫోన్ను ముందుగానే తీసుకొచ్చింది గూగుల్, దీన్ని రూ 44.999 ప్రారంభదరతో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో, మీరు ఒక గొప్ప కెమెరాని అందుకుంటారు. అయితే, ఈ రెండు ఫోన్లలో కూడా తాజా హార్డ్ వేర్ ను పొందుతున్నారు. దీనితో పాటుగా, ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు కూడా  Android ఎక్స్పీరియన్స్ చాలా ప్రత్యేకమైనది. అయితే, ఈరోజు మనం ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ మరియు ధర ఆధారంగా ఏది ఉత్తమైన ఉత్తమైన స్మార్ట్ ఫోనుగా ఉండనుందో తెలుసుకోనున్నాము. కాబట్టి రెండు మొబైల్ ఫోన్ల మధ్య వ్యత్యాసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

OnePlus 7 ప్రో VS గూగుల్ పిక్సెల్ 3a XL: ధరలు

OnePlus 7 ప్రో మొబైల్ ఫోనును వేర్వేరు ఎంపికలతో తీసుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కేవలం రూ 48.999  ధరతో  కొనుగోలు చేయవచ్చు. అలాగే, 8RAM మరియు 256GB స్టోరేజి మోడల్ కేవలం రూ 52.999 ధరతో పొందవచ్చు. ఇక చివరిది మరియు శక్తివంతమైన RAM కలిగిన వేరియంట్ అయినటువంటి 12GB RAM మరియు 256GB స్టోరేజి మోడల్ రూ 57.999 రూపాయలను ఖర్చు చేయాల్సివుంటుంది. ఈ మొబైల్ ఫోన్ యొక్క 8GB RAM మరియు 256GB మోడళ్లు ఆల్మాండ్ రంగులో 52,999 రూపాయల ధరకే లభిస్తాయి. ఈ మొబైల్ ఫోన్ నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే, ఆల్మాండ్ రంగులలో మీకు అందుబాటులో ఉంది. గూగుల్ తన పిక్సెల్ 3a పరికరాన్ని రూ. 39,999 ధరకే నిర్ణయించినప్పటికీ, పిక్సెల్ 3a ఎక్స్ఎల్ ధర రూ. 44,999 గా ఉంటుంది.

OnePlus 7 ప్రో VS గూగుల్ పిక్సెల్ 3a XL: హార్డ్వేర్

ఈ OnePlus 7 ప్రో మొబైల్ ఫోన్ను మీరు ఒక 12GBRAMతో పాటుగా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855  చిప్సెట్ తో అందుకుంటారు. ఇది 256GB స్టోరేజితో మీకు కావాల్సినంత స్టోరేజి స్పేస్ ని ఇస్తుంది. ఇది OnePlus నుండి Snapdragon 855 తో ప్రారంభించబడిన మొట్టమొదటి ఫోన్. ఈ మొబైల్ ఫోన్ కాకుండా, మార్కెట్లో ఈ చిప్సెట్తో ఎటువంటి ఫోన్ ఇంతవరకూలేదు. అయితే, పనితీరు విషయంలో, మీరు ఈ మొబైల్ ఫోన్ హానర్ వ్యూ 20, హువాయ్ P30 ప్రో మరియు గెలాక్సీ S10E వంటి వాటికీ నేరుగా పోటీగా నిలుస్తుంది. ఇక గూగుల్ 3A XL విషయానికి వస్తే, దీన్ని ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 670 SoC, 4GB RAM మరియు 64GB స్టోరేజితో పొందుతారు. గూగుల్ దీన్ని టైటాన్ M సెక్యూరిటీ చిప్ తో తీసుకొచ్చింది, కానీ పిక్సెల్ విజువల్ కేర్  ఇందులో లేదు.

OnePlus 7 ప్రో VS గూగుల్ పిక్సెల్ 3a XL: డిస్ప్లే

ఈ మొబైల్ ఫోన్లో మీరు 6.67-అంగుళాల పూర్తి AMOLED డిస్ప్లేని పొందుతారు, ఇది ఒక QHD + ప్యానెల్. ఈ ఫోన్ డిస్ప్లేట్ నుండి A + రేటింగ్ ఇవ్వబడింది. దాని పిక్సెల్ సాంద్రత 516 ppi గా వుంటుంది మరియు ఇది HDR10 + సర్టిఫికేట్ కూడా కలిగివుంటుంది. దీనితో పాటుగా, 90Hz. రిఫ్రెష్ రేటుతో ఉంటుంది కాబట్టి, యానిమేషన్, నావిగేషన్ మరియు వీడియో ప్లేబ్యాక్ చాలా సున్నితంగా చేస్తుంది. అయితే, గూగుల్ పిక్సెల్ 3A XL మాత్రం 18.5 ఆస్పెక్ట్ రేషియా కలిగిన  ఒక 5.6. అంగుళాల FHD + డిస్ప్లేతో చేశారు. అలాగే, 3A XL విషయానికి వస్తే, ఇది 6 అంగుళాల FHD + డిస్ప్లే మరియు 18: 9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన gOLED తో అందించారు. ఈ రెండు ఫోన్లు కూడా డ్రాగన్ టైల్  ప్రొటెక్షన్ ఇవ్వబడ్డాయి.

OnePlus 7 ప్రో VS గూగుల్ పిక్సెల్ 3a XL: కెమెరా

ఇక కెమెరా గురించి చూసినట్లయితే, మీరు ఈ OnePlus 7 ప్రో మొబైల్ ఫోన్ లో ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుకుంటారు. ఈ మొబైల్ ఫోన్లో మీరు 48MP సోనీ IMX 586 సెన్సార్ను అందుకుంటున్నారు. ఇది f / 1.6 ఎపర్చరు లెన్స్ మరియు కస్టమ్-చేసిన 7-ఎలిమెంట్ ప్లాస్టిక్ లెన్స్లతో చూడవచ్చు. ఇందులో   మీరు 3x జూమ్ తో పొందొచ్చు. అలాగే, ఈ మొబైల్ ఫోన్ లో మీరు అల్ట్రా-వైడ్ 16MP లెన్స్ అందుకుంటారు మరియు ఒక 8MP Telephoto లెన్స్ కూడా దీనితోపాటు జతగా ఉంటుంది. ఈ కెమేరాతో OIS మరియు EIS మద్దతు కూడా ఉంటుంది. అయితే, గూగుల్ పిక్సెల్ 3A XL లో చూసినట్లయితే  పిక్సెల్ 3 సిరిస్ ఫోన్లలో లాగానే ఇందులో కూడా 12.2  మెగాపిక్సెల్స్ కెమెరాని, F / 1.8 అపర్చరుతో మరియు  Sony IMX363 సెన్సార్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ముందు, ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది మరియు దాని ఎపర్చరు f / 2.0గా ఉంటుంది. ఈ కెమెరాతో మీరు ప్లేగ్రౌండ్, నైట్ సైట్, పోర్ట్రెయిట్ మోడ్ మరియు HDR + వంటి ఫీచర్లు పొందుతారు.

OnePlus 7 ప్రో VS గూగుల్ పిక్సెల్ 3a XL: బ్యాటరీ మరియు ఇతర ఫీచర్లు

పిక్సెల్ 3a కొంచెం తక్కువ సామర్ధ్యం గల ఒక 3000mAh బ్యాటరీతో వస్తే, ఒక 3,700 mAh బ్యాటరీతో  Pixel 3a XL అందుబాటులో ఉంది. ఈ ఫోన్లలో 18W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ మద్దతు మరియు పిక్సెల్ యాక్టివ్ ఎడ్జ్ , 3.5mm ఆడియో జాక్, మరియు స్టీరియో స్పీకర్లు వంటి అనేక ఇతర లక్షణాలను కూడా ఫోనులో చేర్చారు. ఈ ఫోన్లు Android 9 pi OS తో పనిచేస్తాయి మరియు సంస్థ మూడు సంవత్సరాల పాటు భద్రత మరియు OS అప్డేట్ లను అందిచనున్నట్లు వాగ్దానం చేస్తుంది. ఇక OnePlus 7 ప్రో మొబైల్ ఫోన్ల గురించి చూస్తే, మీరు ఇందులో గొప్పదైన మరియు తాజా సాంకేతిక వేలిముద్ర సెన్సారుతో పాటుగా డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందుకుంటారు. సంస్థ ఈ ప్రయోజనం కోసం Dolby తో కలిసి పనిచేసింది. ఈ మొబైల్ ఫోన్లో మీరు ఒక పెద్ద 4000mAh సామర్థ్య బ్యాటరీని పొందుతారు. ఇది గతంలో వచ్చిన వాటి కంటే 38 శాతం వేగంగా ఛార్జింగ్ చేసేలా వస్తుందని చెప్పబడింది. ఆక్సిజన్OS 9 తో పాటు, ఆండ్రాయిడ్ 9 పై OS తో ఇది ప్రారంభించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo