ఈరోజు నుండి ONEPLUS 7 PRO 12GB ర్యామ్ వేరియంట్ అమ్మకాలు మొదలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 May 2019
HIGHLIGHTS
 • ONEPLUS ప్రియలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Oneplus 7 Pro 12GB ర్యామ్ నెబ్యులా కలర్ వేరియంట్ ఈ రోజు నుండి సేల్ కి సిద్ధమైంది.

ఈరోజు నుండి ONEPLUS 7 PRO 12GB ర్యామ్ వేరియంట్ అమ్మకాలు మొదలు

ONEPLUS ప్రియలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న OnePlus 7 Pro 12GB ర్యామ్ నెబ్యులా కలర్ వేరియంట్ ఈ రోజు నుండి సేల్ కి సిద్ధమైంది.  వన్ ప్లస్ సంస్థ తన Oneplus 7 Pro స్మార్ట్ ఫోన్ను గొప్ప కెమేరాలు, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ మరియు బెస్ట్ డిస్ప్లేతో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC తో తీసుకొచ్చింది మరియు ఇది 7nm చిప్సెట్ కావడంతో అత్యంతవేగంగా పనిచేస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB/12GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. అయితే, లాంచ్ సమయంలో ముందుగా ప్రకటించినట్లుగా మరొక ప్రత్యేక కలర్ వేరియంట్ అయినటువంటి, నెబ్యులా బ్లూ కలర్ వేరియంట్, సరికొత్తగా అమెజాన్ నుండి ఈరోజు నుండి అమ్మకానికి సిద్దమయ్యింది.

OnePlus 7 Pro ధర

OnePlus 7 Pro - 6GB  + 128GB  - Rs. 48,999

OnePlus 7 Pro - 8GB  +  256GB  - Rs. 52,999

OnePlus 7 Pro - 12GB  + 256GB  - Rs. 57,999

OnePlus 7 Pro లాంచ్ ఆఫర్లు

OnePlus 7 ప్రో స్మార్ట్ ఫోనుతో పాటుగా జియో యొక్క 9300 రూపాయల బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలు చేసేవారికి 2,000 రూపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, 6 నెలల EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI ని కూడా అందిస్తోంది.      

OnePlus 7 Pro  ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ 3120 x 1440 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిచగల ఒక 6.67 అంగుళాల QHD + ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లేలో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి స్క్రీన్ అందించింది మరియు ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో మొదటిసారిగా అత్యంత వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ 7nm ప్రాసెస్సరుతో తీసుకొచ్చింది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB/12GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. కేవలం వేగం ఒక్కటే కాకుండా, స్టైల్ మరియు ట్రెండ్ రెండింటిని  జత చేసినట్లు చెప్పొచ్చు.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో f/1.6 అపర్చరు కలిగిన 48MP SonyIMX586 సెన్సర్ ని ప్రధాన కెమెరాగా అందించింది. దీనికి జతగా మరొక  f/2.2 అపర్చరు కలిగిన 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా మరియు  f/2.4 అపర్చరు కలిగిన 8MP  కెమేరాలను కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమేరాగా అందించింది. ఈ కెమేరాతో 4K రిజల్యూషన్ తో 30/60fps వద్ద వీడియోలను తీసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ఇందులో పాప్ అప్ సెల్ఫీ కెమేరాని తీసుకొచ్చింది వన్ ప్లస్ సంస్థ, ఇది  ఒక SonyIMX 471 సెన్సార్ గల 16MP కెమేరాని అందించి. ఈ ఫోనులో రియర్ కెమెరాతో 3X ఆప్టికల్ జూ కూడా చేసుకోవచ్చు. 

OnePlus 7 Pro 12GB Key Specs, Price and Launch Date

Price:
Release Date: 14 May 2019
Variant: 256GB
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.67" (1440 X 3120)
 • Camera Camera
  48 + 16 + 8 | 16 MP
 • Memory Memory
  256GB/12 GB
 • Battery Battery
  4000 mAh
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
oneplus 7 pro oneplus 7 pro 12gb oneplus 7 pro 12gb sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 11499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status