వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో : మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో : మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు
HIGHLIGHTS

ఈ ఫోన్ మీకు ఒక 48MP వెనుక కెమెరాతో అందుతుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో, మీకు అత్యంతవేగవంతంగా ఉంటుంది.

ఇటీవల OnePlus 7 మరియు OnePlus 7 ప్రో మొబైల్ ఫోన్లు భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. ఈ  OnePlus 7 మరియు OnePlus 7 ప్రో  సేల్ కూడా ఇప్పుడు మొదలయ్యింది. అయితే, OnePlus తో పోలిస్తే, మీరు ప్రో వేరియంటులో కొన్ని మంచి ఫీచర్లను అందుకుంటారు. OnePlus 7 ప్రో మొబైల్ ఫోనులో మీరు ఒక 'Fluid ' AMOLED డిస్ప్లే అందుకుంటారు,ఈ OnePlus 7 ఫోన్లలో మొదటి సారిగా ఇటువంటి రకమైన స్క్రీన్ వాడడటం చూడొచ్చు. ఇది QHD + ప్యానెల్, మరియు రిఫ్రెష్ రేట్ 90Hz గా ఉంటుంది. అంతేకాకుండా,  ఇందులో ఒక పాప్-అప్ సెల్ఫీ కెమెరాని  కూడా పొందుతున్నారు. అలాగే ఈ ఫోన్ మీకు ఒక 48MP వెనుక కెమెరాతో  అందుతుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో, మీకు అత్యంతవేగవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య పెద్ద గమనించదగిన తేడాలు ఏమిటో ఇక్కడ చూడబోతున్నాం.

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో : ధర

వన్ ప్లస్ 7 ప్రో మొబైల్ ఫోనును వేర్వేరు వేరియంట్లలో తీసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కేవలం రూ 48.999 ధరతో కోసం కొనుగోలు చేయవచ్చు. అలాగే,  8RAM మరియు 256GB స్టోరేజి వేరియంట్టును కేవలం రూ 52.999 ధరతో మరియు 12GB RAM మరియు 256GB స్టోరేజి మోడల్ వేరియంటును రూ 57.999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ యొక్క 8GB RAM మరియు 256GB మోడల్  ఆల్మాండ్ కలర్ వేరియంట్  52,999 రూపాయల ధరకే లభిస్తాయి. ఈ మొబైల్ ఫోన్ నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే, ఆల్మాండ్ రంగులలో మీకు అందుబాటులో ఉంది.

OnePlus7 ఇవి కూడా రెండు వేర్వేరు కలర్ వేరియంట్స్ లో ప్రారంభించింది, మీరు ఒక 6GB RAM మరియు 128GB స్టోరేజి మిర్రర్ గ్రే వేరియంట్ ను  కేవలం రూ 32.999 ఒక ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే, మరొక  8GB RAM మరియు 256GB స్టోరేజి మిర్రర్ గ్రే వేరియంట్ ను రూ .37,999  ధరతో మరియు మరొక  8GB RAM మరియు 256GB స్టోరేజి రెడ్ కలర్ వేరియంట్ ను రూ .37,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో :  డిస్ప్లే

OnePlus 7 ప్రో లో, మీరు ఒక మెటల్ నిర్మాణాన్ని అందుకుంటారు. ఇది ఒక మెటల్ డిజైనుతో వచ్చినప్పటికీ, దీన్ని టోటల్ -గ్లాస్ రూపకల్పనతో  అందిస్తున్నారు. ఈ ఫోన్ ముందు మరియు వెనుక ఒక గొరిల్లా గ్లాస్ 6 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్లో మీరు ఒక 6.67-అంగుళాల పూర్తి AMOLED డిస్ప్లేని అందుకుంటారు మరియు  ఇది QHD + ప్యానెల్. ఈ ఫోనుకు DiplayMate నుండి A + రేటింగ్ ఇవ్వబడింది. ఇక ఇది 516 ppi పిక్సెల్స్ డెన్సిటీ తో వస్తుంది. అధనంగా, ఇది ఒక HDR10 + సర్టిఫికేట్ కలిగిన స్మార్ట్ ఫోన్ . దీనితో పాటు, ఇది ఒక 90Hz రిఫ్రెష్ రేటుతో, హై ఎండ్ యానిమేషన్, నావిగేషన్ మరియు వీడియో ప్లేబ్యాక్ వంటివాటిని చాలా సున్నితంగా చేస్తుంది. ఇక, వన్ ప్లస్ 7 విషయానికి వస్తే, దీని డిస్ప్లేని ఒక వాటర్ డ్రాప్ డిజైనుతో అందించారు  ఉంటే ఇది 6T మాదిరిగానే అనిపిస్తుంది మరియు ఇందులో ప్రో వంటి ఒక పూర్తి స్క్రీన్ డిస్ప్లే డిజైన్ పొందలేము. అయితే, మీరు ఒక 6.2-అంగుళాల FHD + AMOLED డిస్ప్లేని ఒక 60Hz  రిఫ్రెష్ రేటుతో  అందుకుంటారు.

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో :  పెర్ఫార్మెన్స్

వన్ ప్లస్ 7 ప్రో మొబైల్ ఫోన్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసరుకు జతగా 12GB RAM శక్తితో వస్తుంది. ఇందులో  256GB స్టోరేజిని కూడా అందుకుంటారు. ఇది OnePlus నుండి Snapdragon 855 తో ప్రారంభించబడిన  మొట్టమొదటి ఫోన్. ఈ మొబైల్ ఫోన్ కాకుండా, మార్కెట్లో ఈ చిప్సెట్తో మరే ఇతర ఫోన్ అందుబాటులో లేదు. అయితే, ఫెరఫార్మెన్స్ , హువావే  P30 ప్రో, హానర్ 20 మరియు గాలక్సీ S10 వంటి వాటికీ గట్టి పోటిగా వుంటుంది. అలాగే,  OnePlus 7 మొబైల్ ఫోనులో కూడా,  మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్ను పొందుతారు.

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో :  కెమెరా

ఇక కెమెరా గురించి మాట్లాడితే, మీరు వన్ ప్లస్ 7 ప్రో మొబైల్ ఫోన్లో ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. ఈ మొబైల్ ఫోన్లో మీరు ఒక 48MP సోనీ IMX 586 సెన్సార్ను అందుకుంటున్నారు. ఇది f / 1.6 ఎపర్చరు లెన్స్ మరియు కస్టమ్-చేసిన 7-ఎలిమెంట్  ప్లాస్టిక్ లెన్స్లతో వస్తుంది. ఇది కూడా మీకు 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది.  అలాగే,  ప్రధాన కెమెరాకు జతగా ఒక 16MP  అల్ట్రా -వైడ్  లెన్స్ మరియు 8MP టెలిఫోటో లెన్స్లతో జతచేయబడింది, ఇది OIS మరియు EIS మద్దతు కూడామద్దతును అందిస్తుంది.

అయితే OnePlus 7 మొబైల్ ఫోన్ మాత్రం, ఒక 48MP ప్రధాన సెన్సార్ మరియు ఒక 5MP ద్వితీయ సెన్సారుతో కలగలిపిన ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పుతో వస్తుంది. మీకు దీనితో పాటుగా ఒక డ్యూయల్ LED ఫ్లాష్ కూడా అందుతుంది. దీనితో పాటు, ఈ మొబైల్ ఫోన్లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది.

వన్ ప్లస్ 7 VS వన్ ప్లస్ 7 ప్రో : బ్యాటరీ మరియు ఇతర ఫీచర్లు

OnePlus 7 ప్రో మొబైల్ ఫోన్లో, మీకు ఒక గొప్ప మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫింగర్ ప్రింట్  సెన్సార్ మరియు స్టీరియో స్పీకర్లను కూడా అందుకుంటారు. సంస్థ ఈ టెక్నాలజీని అందించడం కోసం  Dolby తో కలిసి పనిచేసింది. ఈ మొబైల్ ఫోన్ ఒక పెద్దదైన 4000mAh సామర్థ్య బ్యాటరీతో వస్తుంది. ఇది గత ఫోన్ కంటే 38 శాతం వేగంగా ఛార్జ్  చేయగలిగేలా ఉన్నట్లు చెప్పబడింది. ఆక్సిజన్OS 9 తో పాటు, ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఈ ఫోన్ తో ప్రారంభించబడింది. అయితే, OnePlus 7 మొబైల్ ఫోన్లో, మీరు 3700mAh బ్యాటరీని అందుకుంటారు, అదే విధంగా ఈ మొబైల్ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇవ్వడం జరిగింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo