ఇండియాలో OnePlus 15R లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
OnePlus 15R ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది
వన్ ప్లస్ 15R ఆక్సిజన్ 16 OS తో వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ యొక్క ఇమేజ్ తో కూడిన టీజర్ ను వన్ ప్లస్ అమెజాన్ ద్వారా విడుదల చేసింది
OnePlus 15R స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ నెలలో వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15 లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి బడ్జెట్ వేరియంట్ వన్ ప్లస్ 15R లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన డిజైన్ చూస్తుంటే, వన్ ప్లస్ 15 తో పాటు చైనాలో లాంచ్ చేసిన Ace 6 మాదిరిగా కనిపిస్తుంది.
SurveyOnePlus 15R : లాంచ్ డేట్
వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కోసం కమింగ్ సూన్ ట్యాగ్ మాత్రమే ఈ ఫోన్ లాంచ్ టీజర్ లో ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఈ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రధానమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ టీజర్ ను అమెజాన్ ద్వారా విడుదల చేసింది. వన్ ప్లస్ ఆక్సిజన్ 16 OS తో వస్తుందని చెబుతూ ఈ ఫోన్ యొక్క ఇమేజ్ తో కూడిన టీజర్ ను వన్ ప్లస్ అమెజాన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫోన్ గురించి ఇతర వివరాలు ఇంకా అందించలేదు.
OnePlus 15R : అంచనా ఫీచర్స్
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ తో పాటు చైనా మార్కెట్లో వన్ ప్లస్ ఏస్ 6 స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేసింది. వన్ ప్లస్ 15 ఫోన్ ను ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేసింది. ఇదే దారిలో వన్ ప్లస్ ఏస్ 6 ఫోన్ ని వన్ ప్లస్ 15R లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఇండియా వేరియంట్ లాంచ్ కోసమా అందించిన టీజర్ ఇమేజ్ ఉన్న ఫోన్ మరియు చైనాలో విడుదలైన ఏస్ 6 ఫోన్ రెండు ఫోన్లు కూడా చూడటానికి ఒకే మాదిరిగా కనిపిస్తాయి. అందుకే ఈ అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఏస్ 6 ఫోన్ చైనా మార్కెట్లో Snapdragon 8 Elite చిప్ సెట్ మరియు 165 Hz రిఫ్రెష్ కలిగిన గొప్ప డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ సోనీ సూపర్ కెమెరా సెటప్, 7800 mAh హెవీ బ్యాటరీ మరియు 120W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
Also Read: Nothing Phone (3a) Lite లాంచ్ డేట్ ప్రకటించిన నథింగ్.!
వన్ ప్లస్ 15R ఫోన్ ఇండియా లాంచ్ మాత్రమే వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కచ్చితమైన లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఫోన్ గురించి చర్చించింది, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ మాత్రమే. ఈ ఫోన్ ఫీచర్స్ కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మనం ఎదురు చూడాల్సిందే.