OnePlus 15R మరియు Pad Go 2 ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ.!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ OnePlus 15R స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది

Pad Go 2 ఇండియా లాంచ్ డేట్ ఈరోజు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి

వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ OnePlus 15R స్మార్ట్ ఫోన్ మరియు ప్యాడ్ గో 2 ఇండియా లాంచ్ డేట్ ఈరోజు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. కొత్త స్మార్ట్ ఫోన్ మరియు ప్యాడ్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్ కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా వన్ ప్లస్ 15 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్ నుంచి లైట్ వెర్షన్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తోంది.

OnePlus 15R మరియు Pad Go 2: ఇండియా లాంచ్ డేట్ ఏమిటి?

వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ మరియు ప్యాడ్ గో 2 రెండు డివైజెస్ కూడా డిసెంబర్ 17వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతాయి. వీటిలో వన్ ప్లస్ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ తో రావచ్చని ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ప్యాడ్ గో 2 కూడా రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఈ ప్యాడ్ టీజర్ ఇమేజ్ వెల్లడిస్తోంది.

OnePlus 15R : ఫీచర్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ అవుతుంది. ఈ ఫోన్ లో Ai కోసం ప్రత్యేకమైన బటన్ బటన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు రెండు కొత్త రంగుల్లో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫారిన్ చాలా దాదాపు వన్ ప్లస్ 15 ఫోన్ ను పోలిన డీజియాన్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP 66 IP 68, IP 69 మరియు IP 69K బెస్ట్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో లాంచ్ అవుతుంది.

Also Read: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Philips Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!

Pad Go 2 : ఫీచర్స్

ఒక ప్యాడ్ గో 2 విషయానికి వస్తే, ఈ ప్యాడ్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో వెనుక సింగల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ స్లీక్ బెజెల్ కలిగిన డిజైన్ తో ఉంటుంది. ఇందులో వేగంగా పని చేసే స్టయిల్స్ పెన్ ఉంటుంది. అంతేకాదు, ఈ ప్యాడ్ గో 2 లో క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ప్యాడ్ 5G సపోర్ట్ తో లాంచ్ అవుతుంది.

ఈ రెండు డివైజెస్ కీలక ఫీచర్లు మరియు స్పెక్స్ కూడా త్వరలోనే అందిస్తుంది. వన్ ప్లస్ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ మరియు ప్యాడ్ గో 2 కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :