OnePlus 13s కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

OnePlus 13s స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ స్లీక్ మరియు క్లీన్ డిజైన్ ఉంటుంది

ఈ ఫోన్ Dolby Vision, HDR10+ మరియు HDR ViVid వంటి మల్టీ ఫార్మాట్ లకు సపోర్ట్ చేస్తుంది

OnePlus 13s కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

OnePlus 13s స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్లీక్ మరియు క్లీన్ డిజైన్ ఉంటుంది. ఈరోజే సరికొత్తగా వన్ ప్లస్ లాంచ్ చేసిన వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 13s : ఫీచర్స్

వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను క్లీన్ మరియు స్లీక్ డిజైన్ తో వన్ ప్లస్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.32 ఇంచ్ LTPO Pro XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1600 HBM వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Vision, HDR10+ మరియు HDR ViVid వంటి మల్టీ ఫార్మాట్ లకు సపోర్ట్ చేస్తుంది.

oneplus 13s launch price India

ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ అందించిన లేటెస్ట్ అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS 4.0) సూపర్ ఫాస్ట్ స్టోరేజ్ కూడా అందించింది. ఇది లేటెస్ట్ ఆక్సిజన్ 15 సాఫ్ట్ వేర్ ఆధారిత ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ లో 50MP (Sony LYT-700) ప్రధాన కెమెరా మరియు 2X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 50MP టెలిఫోటో కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 32MP లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 60fps/30fps తో 4K వీడియోలు రికార్డింగ్ సపోర్ట్ మరియు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Bluetooth 6.0 మరియు NFC ఎనేబుల్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5,850 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో హాప్టిక్ మోటార్ వైబ్రేషన్ ను కూడా అందించింది. ఈ ఫోన్ OReality ఆడియో మరియు నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: 16mm టైటానియం స్పీకర్లతో కొత్త Buds Infinity ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన Truke

OnePlus 13s : ప్రైస్

వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 12GB + 256GB వేరియంట్ ని రూ. 54,999 రూపాయల ధరతో మరియు 12GB + 512GB వేరియంట్ ని రూ. 59,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్సైట్ నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్స్

వన్ పీల్సు ఈ ఫోన్ పై ఆకట్టుకునే లాంచ్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందుకునే అవకాశం వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo